BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిజల్ట్‌పై టీమ్ స్పందనిదే..
Bhartha Mahasayulaki Wignyapthi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అద్భుతంగా రావడానికి కారణం ఎవరంటే?

BMW: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా నటించి, ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaki Wignyapthi). కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రాన్ అవుతోంది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాల. మా హీరో రవితేజకు, హీరోయిన్స్‌కి, మా సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. నేను రెండుసార్లు భ్రమరాంభ థియేటర్‌కి వెళ్ళాను. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ఉన్నాయి. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ రూ. 175, మల్టీప్లెక్స్ రూ. 200 ఉంటే.. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ రూ. 195, మల్టీప్లెక్స్ రూ. 250గా ఉన్నాయి. అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయండని కోరారు.

Also Read- Rithu Chowdary: వాళ్లిద్దరి కంటే ముందు.. నేను చనిపోవాలని కోరుకుంటా!

కారణం రవితేజానే..

డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ఈ సినిమాను బిగినింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులని నవ్వించాలనే ఉద్దేశంతోనే మొదలు పెట్టడం జరిగింది. మేము అనుకున్న టార్గెట్‌ని 100 శాతం రీచ్ అయ్యాం. ఆడియన్స్ నాన్ స్టాప్‌గా నవ్వుతున్నారు. సత్య, వెన్నెల కిషోర్, సునీల్.. ఇలా అన్ని పాత్రలు కూడా హిలేరియస్‌గా ఉన్నాయి. నా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు అని అంటారు. ఈ సినిమాతో ఆ ఆడియన్స్ డబుల్ అయ్యారు. ఈ సినిమా అందరికీ ఇంత బాగా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడియో బ్లాక్ బస్టర్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా బీమ్స్‌కే వెళుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. కార్తీకదీపం, పిన్ని డీజే మిక్స్ సాంగ్స్‌కి అందరూ మురిసిపోతున్నారు. హీరోయిన్లు ఇద్దరూ మొదటి నుంచి ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి కెరీర్‌లో మంచి పాత్రలు చేశామని చెప్పుకుంటున్నందుకు చాలా హ్యాపీ. ఈ స్క్రిప్ట్‌లో పవన్ నాకు హెల్ప్ చేశాడు. ఈ టైటిల్ ఇచ్చింది కూడా తనే. చాలా మంచి టీం తో పని చేసాము. మా హీరో రవితేజతో నాకు పదేళ్ళుగా పరిచయం. ఎప్పటి నుంచో కలిసి పని చేయాలనుకుంటున్నాం. లక్కీగా ఈ సినిమాతో కుదిరింది. రామ్ సత్యనారాయణ క్యారెక్టర్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం రవితేజానే. అందరూ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుతున్నానని అన్నారు.

Also Read- Anaganaga Oka Raju: హిట్టు కొట్టేశామంటోన్న టీమ్.. సంబరాల్లో రాజు!

మేము పడిన కష్టానికి ఫలితమిది

హీరోయిన్ ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యు. తిరుపతిలో ఈ సినిమాను చూసాము. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మేము పడిన కష్టానికి ఫలితం ఇచ్చారు. రవితేజ కామెడీ టైమింగ్ అద్భుతం. ఆ కామెడీ టైమింగ్ ఇందులో అద్భుతంగా కనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. అద్భుతమైన బ్లాక్ బాస్టర్ కొట్టిన నిర్మాత సుధాకర్ చెరుకూరికి కంగ్రాట్యులేషన్స్ అని తెలిపారు. మరో హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ.. ఆడియన్స్ సినిమాని సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేశారు. కిషోర్ తిరుమల నా ఫస్ట్ హిట్ డైరెక్టర్. అలాగే నిర్మాత సుధాకర్ చెరుకూరిని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమాలో నా పాత్రని చాలా రిలేట్ అవుతున్నందుకు ఒక నటిగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. రోల్ మోడల్ అంటే రవితేజలా ఉండాలి. ఆయనకు నేను ఫ్యాన్‌ని. ఆయనకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన అభిమానిగా నాకు ఎంతో గర్వంగా ఉంది. అందరికీ థాంక్యూ అని చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Polaki Vijay: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్ వేళ.. విజయ్ పొలాకి మరోసారి ఎమోషనల్ పోస్ట్!

Yellamma: ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ రెడీ.. దేవి శ్రీ ప్రసాద్ అరాచకం అంతే..!

Nidhhi Agerwal: పవర్ స్టార్, రెబల్ స్టార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే..

Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!

Hyderabad Crime: అల్వాల్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య!