CP Sajjanar: ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న సిట్
CP Sajjanar ( image credit: swetcha reporter)
Telangana News

CP Sajjanar: ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న సిట్.. తప్పు చేయకపోతే భయమెందుకు? : సీపీ సజ్జనార్​!

CP Sajjanar: ఓ ఐఏఎస్​ అధికారిణి మంత్రి వ్యక్తిత్వ హననం జరిగేలా వార్తా కథనం ప్రసారం చేసిన కేసులో సిట్​ అధికారులు ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిని విచారణ అనంతరం విడుదల చేశారు. మిగితా ఇద్దరిని అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇక, సిట్ బృందంలోని అధికారులు వార్తా కథనం ప్రసారం చేసిన ఛానల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మొత్తం వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తటంతో సిట్ కు ఇన్​ ఛార్జ్ గా ఉన్న హైదరాబాద్​ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ (CP Sajjanar)​ సందర్శించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. తప్పు చేయకపోతే భయమెందుకు? అని ప్రశ్నిస్తూ విచారణకు వస్తామని చెప్పి ఫోన్లు స్విచాఫ్ చేశారన్నారు. ఓ జర్నలిస్టు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఎయిర్​ పోర్టులో అదుపులోకి తీసుకున్నామన్నారు. ఓ ఐఏఎస్​ అధికారిణి మంత్రిని ఉద్దేశిస్తూ ఇటీవల ఓ ఛానల్​ లో వార్తా కథనం ప్రసారమైన విషయం తెలిసిందే. దీనిపై ఇటు ఐఏఎస్​ అధికారులు అటు ఐపీఎస్ అధికారుల సంఘాలు స్పందించాయి. ఐఏఎస్ అధికారిణి వ్యక్తిత్వ హననం జరిగేలా వార్తా కథనం ప్రసారం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సీపీ సజ్జనార్​ నేతృత్వంలో సిట్​ ను ఏర్పాటు

దీనిపై ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్ రంజన్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ కేసుతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్​ చేసి సోషల్ మీడియాలో పెట్టిన కావలి వెంకటేశ్​ పై మద్దూరు పోలీస్​ స్టేషన్ లో నమోదైన కేసుపై హైదరాబాద్ సీపీ సజ్జనార్​ నేతృత్వంలో సిట్​ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్​ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం సదరు వార్తా ఛానల్ లో పని చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ జర్నలిస్టును శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకోవటం గమనార్హం. ఇక, వార్తా కథనం ప్రసారం చేసిన ఛానల్ కార్యాలయంలో బుధవారం సిట్ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్టు తెలిసింది.

Also Read: CP Sajjanar: సైబర్ బాధితులకు అండగా సీ-మిత్ర.. దేశంలోనే తొలిసారిగా అమలు : కమిషనర్ సజ్జనార్​!

విచారణ అనంతరం

అదుపులోకి తీసుకున్న ముగ్గురిని సిట్ అధికారులు నిశితంగా విచారించారు. అనంతరం ఓ జర్నలిస్టును విడుదల చేశారు. మిగితా ఇద్దరు మాత్రం సిట్ అదుపులోనే ఉన్నారు. బుధవారం సాయంత్రం ఈ ఇద్దరికీ కింగ్​ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి అరెస్ట్​ చూపించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి ఆ తరువాత జైలుకు రిమాండ్​ చేయనున్నట్టుగా సమాచారం.

విమర్శలు

కాగా, సిట్ అధికారులు ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరుపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు స్పందించారు. అన్ని నిబంధనలకు నీళ్లొదిలి పోలీసులు వ్యవహరించారంటూ విమర్శించారు. అసలు నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. ఎమర్జన్సీ ఏమైనా అమల్లో ఉందా? అని అన్నారు.

స్పందించిన సజ్జనార్​

ఎలాంటి ఆధారాలు లేకుండా ఐఏఎస్​ అధికారిణిపై కథనాలు ప్రసారం చేసిన కేసులో ఓ ఛానల్ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నట్టు సిట్ ఇన్​ ఛార్జ్​ గా ఉన్న సజ్జనార్​ తెలిపారు. విచారణకు సహకరించకుండా ఓ జర్నలిస్టు రాత్రికి రాత్రి విదేశాలకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తే ఎయిర్​ పోర్టులో అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి విచారణ కొనసాగుతోందని తెలిపారు. సిట్​ అంటేనే దర్యాప్తు అని చెబుతూ ఇంకా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే రిపోర్టర్లు ఎందుకు భయపడుతున్నారు? అని వ్యాఖ్యానించారు. సదరు ఛానల్ సీఈవో ఎక్కడ ఉన్నారు? విచారణకు రమ్మంటే ఎందుకు రావటం లేదు? ఫోన్లు ఎందుకు స్విచాఫ్ చేసి పెట్టారు? అని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా అరెస్టు తప్పదని చెప్పారు. విచారణకు సహకరించని పక్షంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లినా పట్టుకొచ్చి చట్టం ముందు ప్రవేశ పెడతామన్నారు.

Also Read: VC Sajjanar: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. స్వయంగా ప్రశ్నించనున్న సీపీ సజ్జనార్​!

Just In

01

Nidhhi Agerwal: పవర్ స్టార్, రెబల్ స్టార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే..

Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!

Hyderabad Crime: అల్వాల్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య!

BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అద్భుతంగా రావడానికి కారణం ఎవరంటే?

Khammam Police: ఖమ్మం జిల్లాలో కోడి పందేల స్థావరాల స్థావరాలపై.. డ్రోన్‌ కెమెరాల సహాయంతో పోలీసుల నిఘా!