Megastar Chiranjeevi: ప్రసాద్ గారు రెండు రోజుల గ్రాస్ ఎంతంటే?
msg2nd-day-grass
ఎంటర్‌టైన్‌మెంట్

Megastar Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ రెండు రోజుల గ్రాస్ ఎంతంటే?.. బాస్ కొల్లగొట్టాడుగా..

Megastar Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ మరోసారి సినిమా పరిశ్రమకు తన సత్తా ఏమిటో చూపించారు. మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. రెండు రోజుల మొత్తం కలెక్షన్లు రూ.120 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వచ్చిన సినిమాగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లుగా భారీ వసూళ్లు కూడా రాబడుతోంది. దీంతో నిర్మాతల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్రం ప్రీమియర్స్ రెండు రోజుల కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఈ స్థాయి వసూళ్లు రావడం టాలీవుడ్‌లో ఒక అరుదైన ఫీట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. దాదాపు అన్ని సెంటర్లలో ‘ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్’ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్, పాజిటివ్ టాక్ కారణంగా రెండో రోజు కూడా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.

Read also-Anil Ravipudi: మెగాస్టార్ సినిమాలో ఇళయరాజా సాంగ్ వాడినా కేసు ఎందుకు వేయలేదంటే?..

షైన్ స్క్రీన్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ, “మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ బద్దలుకొట్టేసారు” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేవలం రెండు రోజుల్లో రూ. 120 కోట్లు దాటడం చూస్తుంటే, లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని బెంచ్ మార్క్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. మొత్తం మీద ‘మన శంకరవరప్రసాద్ గారు’ తన పవర్ ఫుల్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద నిజమైన ‘సంక్రాంతి’ ముందే తెచ్చారని అభిమానులు సంబరపడుతున్నారు.

Read also-Ram Charan: చిరు, పవన్ ఫామ్‌లోకి వచ్చేశారు.. చరణ్ పిక్చర్ అభి బాకీ హై!

భారీ అంచనాలతో విడుదలైన మెగాస్టార్ ‘మనశంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకోండంతో ఫామిలీ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే రూ. 120 కోట్లు వసూలు చేయడంతో ఈ సినిమా టోటల్ కలెక్షన్లు మొత్తం దాదాపు నాలుగు వందల రూ.400 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వింటేజ్ లుక్ తో బాస్ అదరగొడుతుంటే థియేటర్లు మొత్తం ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఈజ్ బేక్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రీమియర్లతోనే ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది. మెగాస్టార్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా మన శంకరవరప్రసాద్ గారు రికార్డు క్రియేట్ చేశారు. రానున్న రోజుల్లో ఈ సినిమా మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Just In

01

Megastar Comeback: ప్రసాద్ గారు ఇంట్లో మూవీ టీం సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్

Ramchander Rao: ట్రాఫిక్ చలాన్లు సైకిల్‌కి కూడా వేస్తారా.. ప్రభుత్వంపై రాంచందర్ రావు సెటైర్లు

Mahabubabad Tahsildar: అక్రమాలకు నిలయంగా తహసీల్దార్‌ కార్యాలయం.. చేయి తడిపితేనే భూముల సర్వేలు చేస్తారా?

Anaganaga Oka Raju Review: సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ పండగ ఎలా చేశాడంటే?.. ఫుల్ రివ్యూ..

GHMC: సరి కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్న జీహెచ్ఎంసీ.. రిజల్ట్ అదరహో…!