Gram Panchayat Funds: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..!
Gram Panchayat Funds (imagecredit:twitter)
Telangana News

Gram Panchayat Funds: తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 2500 కోట్లు..!

Gram Panchayat Funds: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో, గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం సంప్రదింపుల ఫలితంగా నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీపీలకు రావాల్సిన సుమారు రూ. 2500 కోట్ల పెండింగ్ నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ నెలాఖరు లోపు కనీసం రూ. వెయ్యి కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్టు సమాచారం. మిగిలిన 1500 కోట్ల నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

15వ ఆర్థిక సంఘం

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల నిధులను వెంటనే వినియోగించుకునేలామంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాలకు మెమో జారీ చేసి, నిధుల వినియోగంలో డిజిటల్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఖాతాను పి ఎఫ్ ఎం ఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలి. అదే సమయంలో eGramSwaraj పోర్టల్‌లో కూడా ఆ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయాలి. నిధుల వినియోగానికి మేకర్, చెకర్‌గా వ్యవహరించే వారి డిజిటల్ సంతకాలను eGramSwarajలో నమోదు చేసి సంబంధిత ఎంపీడీఓ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది.

Also Read: Jupally Krishna Rao: పర్యాటక రంగం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి జూపల్లి కృష్ణారావు!

డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు

గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ మేకర్‌గా, సర్పంచ్ చెక్కర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం మరో సారి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు క్లాస్ 3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి కాగా, సైనింగ్, ఎన్‌క్రిప్షన్ సౌకర్యంతో పాటు యు ఎస్ బి టోకెన్ కూడా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను GeM పోర్టల్, ఈ-ప్రోక్యూర్‌మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా వెంటనే సేకరించి, నమోదు ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి 15 ఆర్దిక సంఘం నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారి చేసింది.

Also Read: Seethakka: మేడారం జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి.. అధికారులకు సీతక్క కీలక సూచనలు!

Just In

01

Megastar Comeback: ప్రసాద్ గారు ఇంట్లో మూవీ టీం సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్

Ramchander Rao: ట్రాఫిక్ చలాన్లు సైకిల్‌కి కూడా వేస్తారా.. ప్రభుత్వంపై రాంచందర్ రావు సెటైర్లు

Mahabubabad Tahsildar: అక్రమాలకు నిలయంగా తహసీల్దార్‌ కార్యాలయం.. చేయి తడిపితేనే భూముల సర్వేలు చేస్తారా?

Anaganaga Oka Raju Review: సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ పండగ ఎలా చేశాడంటే?.. ఫుల్ రివ్యూ..

GHMC: సరి కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్న జీహెచ్ఎంసీ.. రిజల్ట్ అదరహో…!