Kiran Royal | తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజాగా బాధితురాలు లక్ష్మీ తిరుపతిలో ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు బయట పెట్టారు. కిరణ్ రాయల్ తనను మాత్రమే కాకుండా మానస అనే మరో అమ్మాయిని కూడా మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఆమెను నమ్మించి మోసం చేశాడని.. ఆ తర్వాత తనను కూడా మోసం చేశాడని.. కోటి రూపాయలు అప్పు కింద తీసుకున్నాడంటూ చెప్పారు. ఇలాంటి నీచుడిని మాత్రం వదిలపెట్టొద్దని.. పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలంటూ ఆమె కోరారు.
తన వెనకాల ఏ పార్టీ గానీ, పొలిటికల్ లీడర్లు గానీ లేరని.. న్యాయం కోసమే తాను పోరాడుతున్నట్టు వివరించారు. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని.. తాను చనిపోయినా సరే తన పిల్లలకైనా న్యాయం జరిగేలా తాను పోరాడుతున్నట్టు ఆమె కోరారు. ఈ సందర్భంగా మానసతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డును కూడా ఆమె బయట పెట్టారు. డబ్బుల కోసమే లక్ష్మీతో ఉన్నానని… నువ్వేదో ఇస్తావనే నీతోనే ఉన్నానంటూ నాతో చెప్పాడని మానస అనే అమ్మాయి అందులో మాట్లాడినట్టు ఉంది. ఈ ఆడియో రికార్డు ఇప్పుడు సంచలనంగా మారిపోయింది.