GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో సుమారు 2 వేల 53 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగిన జీహెచ్ఎంసీ విస్తీర్ణాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. గత నవంబర్ 25న జీహెచ్ఎంసీ పాలక మండలికి పట్టణ విలీన సంస్థల విలీనానికి సంబంధించిన ప్రీయాంబుల్ వచ్చినప్పటి నుంచి విస్తరిస్తున్న జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్ గా కొనసాగిస్తారా? మూడు, నాలుగు ముక్కలు చేస్తారా? అంటూ రకరకాలుగా అధికార, అనధికార, రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చకు తెర దింపుతూ జీహెచ్ఎంసీ పరిధిని మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా, మూడు జిల్లాలుగా, మూడు పోలీస్ కమిష్నరేట్లుగా విభజించనున్నట్లు ఉన్నతాధికారిక వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీలోమని పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 ముగియనుండటంతో 11వ తేదీ సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారిక వర్గాల సమాచారం. ఆ రోజు నుంచే జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన రానున్నట్లు తెలిసింది.
150 మున్సిపల్ వార్డులతో కలిపి..
జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్తీకరణ, పునర్విభజన ప్రతిపాదన సమయంలో సికిందరాబాద్ ను ప్రత్యేకంగా గ్రేటర్ లష్కర్ మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించాలంటూ డిమాండ్లు తెరపైకి వచ్చినా, విభజిస్తారంటూ విస్తృతంగా చర్చలు జరిగినా, దశాబ్దాలుగా హైదరాబాద్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న సికిందరాబాద్ ను అలాగే కొనసాగించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీ పరిధి 2 వేల 53 కిలోమీటర్ల విస్తీర్ణంలో భాగంగా శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, చార్మినార్, సికిందరాబాద్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో ఇటీవలే పునర్విభజించిన 150 మున్సిపల్ వార్డులతో కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల పరిధిలోని 74 మున్సిపల్ వార్డులను కలుపుకుని గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్పొరేషన్ పరిధిలోకి మల్కాజ్ గిరి జోన్, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ల పరిధిలోని 76 మున్సిపల్ వార్డులతో గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయనున్నారు.
అయోమయానికి తావులేకుండా..
27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, పెరిగిన పరిధి పునర్విభజన ప్రక్రియలు మొదలుకుని సర్కిళ్లు, జోన్ల ఏర్పాటు, ఇపుడు మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ వరకు ఎక్కడా ఎలాంటి అయోమయానికి గందరగోళానికి తావులేకుండా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తొలుత ఒక మున్సిపల్ వార్డు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రాకుండా, పరిమిత సంఖ్యలో మున్సిపల్ వార్డులన్నీ ఒకే సర్కిల్ లో ఉండేలా, మూడు కార్పొరేషన్ల ఏర్పాటును దృష్టి లో పెట్టుకుని పునర్విభజన, పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలను చేపట్టిన అధికారులు మూడు కార్పొరేషన్ల సరిహద్దులు, జనాభా, జోన్లు, సర్కిళ్లు, వార్డుల సంఖ్యను కూడా ఫిక్స్ చేసి సర్కారుకు పంపినట్లు తెలిసింది. సర్కారు అధికార ఆమోదమే తరువాయి అని తెల్సింది. మూడు కార్పొరేషన్లుగా ప్రకటించే లోపు ప్రస్తుతం ఏర్పాట్ల స్థాయిలో ఉన్న 117 మున్సిపాల్టీలు, మరో ఆరు కార్పొరేషన్ల ఎన్నికలు ముగిసిన వెంటనే మూడు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించి, పాలక మండలిలను ఏర్పాటు చేసే యోచనలో సర్కారున్నట్లు, ఇదే దిశగా అంతర్గతంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. మూడు కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన మున్సిపల్ వార్డ్డుల రిజర్వేష
ముందే చెప్పిన ‘ స్వేచ్ఛ’
జీహెచ్ఎంసీలోకి పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పెరిగిన విస్తీర్ణాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు ‘స్వేచ్ఛ’ ముందే చెప్పింది. ఈ నెల 2వ తేదీన స్వేచ్ఛ పత్రికలో ఫిబ్రవరి 10 తర్వాత జీహెచ్ఎంసీ మూడు ముక్కలు అనే శీర్షికతో కథనాన్ని కూడా ప్రచురించింది. కేవలం మూడు కార్పొరేషన్లుగా విభజించే విషయమే గాక, ఒక్కో కార్పొరేషన్ పరిధిలోకి రానున్న జోన్లు, ఒక్కో జోన్ లోని సర్కిళ్లు, మున్సిపల్ వార్డుల పూర్తి వివరాలతో స్వేచ్ఛ ఈ కథనాన్ని ప్రచురించింది. అంతేగాక, మరో అడుగు ముందుకేసి గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రస్తుతం ఆరు జోన్లకు అదనపు కమిషనర్ (మానిటరింగ్) గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు స్రిజన, వినయ్ కృష్ణ రెడ్డిలే కొత్తగా ఏర్పడే మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు కూడా స్వేచ్ఛ పేర్కొంది.

