Kuchukulla Rajesh Reddy: ఆ జిల్లాలో పారిశుధ్య సమస్యలు లేకుండా
Kuchukulla Rajesh Reddy: ( image credit: swetcha reporter)
Telangana News

Kuchukulla Rajesh Reddy: ఆ జిల్లాలో పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి!

Kuchukulla Rajesh Reddy: నాగర్‌కర్నూల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (Kuchukulla Rajesh Reddy)తెలిపారు. మున్సిపాలిటీలోని 8వ వార్డులో పర్యటించారు. అలాగే ఎండబెట్లలో 1కోటి 50లక్షలతో నిర్మంచనున్న బాలసదన్, దేశిఇటిక్యాల-మంతటి మధ్య 3కోట్ల 50లక్షలతో నిర్మించే హైలెవల్ వంతెన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం తాడూరు మండల కేంద్రంలో బండలాగుడు పోటీలను ప్రారంభించారు.

 Also ReadKuchkulla Rajesh Reddy: రెండేళ్లలో వెయ్యికోట్లతో అభివృద్ధి.. మళ్లీ అధికారం కాంగ్రెస్ పార్టీదే : కూచుకుళ్ల రాజేష్ రెడ్డి!

చర్యలు తీసుకుంటాం

ఇందులో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పూర్తయిన నూతన రహదారులు మరియు డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలసదన్ భవనం నిర్మాణం ద్వారా అనాధ మరియు ఆశ్రయం లేని పిల్లలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. ఇటీవల 40 కోట్ల రూపాయలు మంజూరు అయ్యావన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణాన్ని పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు.

 Also Read: MLA Rajesh Reddy: కాంగ్రెస్ పార్టీనే‌ దేశానికి రక్ష: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

Just In

01

BB JODI Season 2: డిమోన్, రీతూ ఎంట్రీ.. బాబోయ్ అది కెమిస్ట్రీ కాదు.. !

Jupally Krishna Rao: పర్యాటక రంగం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి జూపల్లి కృష్ణారావు!

Gadwal District: భార్య కాపురానికి రావటం లేదని.. బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం!

Anil Ravipudi: మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని చూశారు

Damodar Raja Narasimha: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 996 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!