Naveen Polishetty: ‘రాజు’కి ఆ నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకోండి
Anaganaga Oka Raju (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’కి ఆ నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకోండి

Naveen Polishetty: మూడు వరుస ఘన విజయాలతో మంచి జోష్ మీదున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్‌తో మంచి క్రేజ్‌‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, సోమవారం సాయంత్రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ప్రీ రిలీజ్ వేడుక (Pre Release Event)ను ఘనంగా నిర్వహించారు.

Also Read- Toxic Controversy: వివాదంలో యష్ ‘టాక్సిక్’ గ్లింప్స్.. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్..

అదే నమ్మకంతో రండి

ఈ కార్యక్రమంలో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ వేడుక కూడా ఈ వరంగల్ ప్రాంతంలోనే జరిగింది. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా సమయంలో మాకు షోలు కూడా దొరకని పరిస్థితి. కేవలం పది షోలు మాత్రమే ఇస్తామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాని ప్రేక్షకులు మౌత్ టాక్‌తో పెద్ద హిట్ చేశారు. నా ప్రతి సినిమాకి ప్రేక్షకులే మార్కెటింగ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా సినిమాని భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమ, మీ అభిమానం, మీరు నాకు అందించిన మూడు విజయాలు.. నాలో ఎంతో ఎనర్జీని నింపాయి. ఆ ఎనర్జీకి రెట్టింపు వినోదాన్ని మీకు అందించేలా ‘అనగనగా ఒక రాజు’ కథ రాయడం జరిగింది. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మీరు ఏ నమ్మకంతో అయితే ఇప్పటి వరకు నా సినిమాలకు వచ్చి, వాటిని హిట్ చేశారో.. అదే నమ్మకంతో ‘అనగనగా ఒక రాజు’కి టికెట్స్ బుక్ చేసుకోండి. ఆలస్యమైనా కానీ, మంచి సినిమా అందించాలనేదే మా ప్రయత్నం. అలాంటి ప్రయత్నంతోనే ఈ సినిమా వస్తుంది.

Also Read- BMW Review: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉందంటే?.. ఫుల్ రివ్యూ

ఆ బాధ్యత నాది

ఇప్పటికే సినిమాను చాలాసార్లు చూసుకున్నాం. అలాగే చిత్ర బృందంలో భాగంకాని కొందరికి ప్రత్యేక షోలు వేసి మరీ సినిమా చూపించాం. వారు సినిమా చూస్తున్నంతసేపూ కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నారు. అలాగే భావోద్వేగ సన్నివేశాలు చూసి హత్తుకున్నారు. సినిమా అయిపోగానే అందరూ నిల్చొని చప్పట్లు కొట్టారు. ఇలాంటి స్పందన చూసి నిజంగా మాకు చాలా సంతోషం కలిగింది. ‘అనగనగా ఒక రాజు’ సినిమా అనేది మా రెండేళ్ల ప్రయాణం. టీంతో సంబంధం లేని వ్యక్తులు.. సినిమా చూసి అంతగా ఎంజాయ్ చేశారంటే.. పండగకు ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో మా సినిమాకి వచ్చి రచ్చ రచ్చ చేసుకోవచ్చు. నా సినిమాల్లో మీరు కోరుకునే ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో ఉంటుంది. అలాగే అందమైన ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ చూస్తూ మా టీం అంతా కంటతడి పెట్టుకున్నారు. టికెట్ బుక్ చేసుకొని జనవరి 14న థియేటర్‌కి రండి.. మీ అందరికీ పండగ సినిమా అందించే బాధ్యత మాది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇక్కడివరకు ఎలా వచ్చావని చాలా మంది నన్ను అడుగుతుంటారు. నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. నాకు బ్యాక్ గ్రౌండ్‌గా ఎన్నో ఫ్యామిలీలు ఉన్నాయి. నా చివరి శ్వాస వరకు మీ అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మా గురువు మెగాస్టార్ పండగకు థియేటర్లలో ఒక ఎనర్జీని సెట్ చేసేశారు. ‘అనగనగా ఒక రాజు’తో మేము ఆ ఎనర్జీని కొనసాగించబోతున్నాం. నాకు ఇష్టమైన హీరోలు చిరంజీవి, రవితేజ, ప్రభాస్ నటించిన సినిమాలతో పాటు నా సినిమా విడుదలవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Human Rights Commission: చైనా మాంజా అమ్మకాలపై.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ సీరియస్!

Uttam Kumar Reddy: సంక్రాంతి వేళ రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డ్!

Ilaiyaraaja: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మ్యాస్ట్రో అనుమతి తీసుకున్నారా?

MLC Dasoju Sravan: సీఎం మాటలు కాంగ్రెస్ పార్టీ విధానమా? ట్రాఫిక్ చలాన్లపై.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్!

Director Maruthi: ‘ది రాజా సాబ్’ అర్థం కావడానికి టైమ్ పడుతుందని నాకు ముందే తెలుసు!