BMW Review: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉందంటే?..
raviteja-review
ఎంటర్‌టైన్‌మెంట్

BMW Review: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉందంటే?.. ఫుల్ రివ్యూ

సినిమా: భర్త మహాశయులకు విజ్ఞప్తి

డైరెక్టర్: కిషోర్ తిరుమల

నటీనటులు: రవితేజ (రామ్ సత్యనారాయణ), ఆషికా రంగనాథ్ (మానస), డింపుల్ హయాతి (బాలమణి), సునీల్, వెన్నెల కిషోర్, సత్య, సుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ మొదలైనవారు.

మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల

నిర్మాత: సుధాకర్ చెరుకూరి (SLV సినిమాస్)

రిలీజ్ డేట్: జనవరి 13, 2026

BMW Review: మాస్ సినిమాలతో ప్రేక్షకులను యాక్షన్ మోడ్ లోకి తీసుకెళ్లిన మాస్ మహారాజ్ ఈ సారి ఫ్యామిలీవైపు తన దిశను మార్చుకున్నారు. అదే క్రమంలో క్లాసిక్ దర్శకుడు కిశోర్ తిరుమలతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) సినిమా చేశారు. రవితేజ ఇటీవలి ఫ్లాప్‌ల తర్వాత ఈ సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. సంక్రాంతి సీజన్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఈ మూవీ మరి ఆ ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిందా? అన్నది ఇక్కడ తెలుసుకుందాం.

Read also-Samyuktha Menon: బీటెక్ చేయకపోవడం అదృష్టం అంటున్న సంయుక్తా మీనన్.. ఎందుకంటే?

కథ..

రామ్ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ బిజినెస్ మాన్. అతని వైన్ విదేశాల్లో రిజెక్ట్ అవుతుంది, దాని కోసం స్పెయిన్ వెళ్తాడు. అక్కడ మానస (ఆషికా రంగనాథ్)తో పరిచయమవుతుంది, ప్రేమలో పడతాడు. కానీ ఇంట్లో భార్య బాలమణి (డింపుల్ హయాతి)తో ఉన్న సమస్యలు, ఇద్దరు మహిళల మధ్య గొడవలు అతన్ని ఇరుకు పరిస్థితిలో పడేస్తాయి. భర్తల సమస్యలు, భార్యలతో రిలేషన్‌షిప్‌లు, కామెడీ ఎలిమెంట్స్‌తో సాగే ఈ స్టోరీలో రామ్ ఎలా బయటపడతాడు? అనేది మెయిన్ ప్లాట్. భర్తలకు ‘విజ్ఞప్తి’ లాంటి థీమ్‌తో ఫన్ ఎలిమెంట్స్ జోడించారు. ఇది రవితేజ మార్క్ కామెడీ టైమింగ్, ఎనర్జీతో సాగే ఫ్యామిలీ స్టోరీ. స్పెయిన్ బ్యాక్‌డ్రాప్, వైన్ బిజినెస్ ఎలిమెంట్స్ కొత్తగా అనిపించవచ్చు, కానీ ఓవరాల్ రొటీన్ లవ్-కామెడీ ఫార్ములాపైనే సినిమా మొత్తం ఆధారపడింది.

విశ్లేషణ

రవితేజ నటించిన “భక్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమా కొంచెం పాత కథలా అనిపిస్తుంది. ఇదే జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇది 2026 నాటి సినిమా లాగా కాకుండా 2010 కాలం నాటి పాత కథతో వచ్చిన చిత్రంగా అనిపిస్తుంది. పెళ్లయిన హీరో విదేశీ ప్రయాణంలో మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం అనే పాత “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” ఫార్ములాను ఇందులో వాడారు. వెన్నెల కిషోర్, సునీల్ సత్యల కామెడీ వల్ల మొదటి సగం కొంత వరకు పరవాలేదనిపించినా, రెండో సగం మాత్రం చాలా ఫ్లాట్‌గా, సాగదీసినట్లుగా ఉంటుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ప్రతిభ ఈ సినిమాకు వృధా అయిందని, పాటలు, సాంకేతిక అంశాలు కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు. కేవలం సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి తీసినట్లుగా ఈ సినిమా ఉంటుంది.

Read also-People Media Factory: ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’పై మెగా దెబ్బ.. మొన్న పవన్, ఇప్పుడు చిరు!

ఎవరు ఎలా చేశారంటే?

ఈ సినిమాలో రవితేజ ఒన్ మ్యాన్ షో అనే చెప్పాలి ఎందుకంటే.. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించారు రవితేజ. రవితేజ ఈ సారి డాన్సులు కూడా అదరగొట్టారు. హీరోయిన్లు గా చేసిన డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ తమకు ఇచ్చాన పాత్రల్లో మెప్పిస్తారు. సునీల్ వెన్నెల కిషోర్, సత్యల కామెడీ టైమింగ్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ లు ఎక్కడా నిరాశపరచలేదు. స్పెయిన్ నేపథ్యంలో సాగే విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. భీమ్స్ అందించిన పాటలు అయితే ప్రేక్షకులను మెప్పించాయి. కామెడీ మెలొడీతో సాగే కథాశం ఓవరాల్ గా అందరినీ నవ్విస్తుంది.

బలాలు

  • రవితేజ
  • కామెడీ
  • ఫస్ట్ఆఫ్

బలహీనతలు

  • కథ
  • కథనం

రేటింగ్ – 2.75/5

Just In

01

Ilaiyaraaja: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మ్యాస్ట్రో అనుమతి తీసుకున్నారా?

MLC Dasoju Sravan: సీఎం మాటలు కాంగ్రెస్ పార్టీ విధానమా? ట్రాఫిక్ చలాన్లపై.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్!

Director Maruthi: ‘ది రాజా సాబ్’ అర్థం కావడానికి టైమ్ పడుతుందని నాకు ముందే తెలుసు!

Iran Unrest: సంచలనం.. ఇరాన్‌ నిరసనల్లో 2000 మంది మృత్యువాత!

Dileep Vishwakarma: మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం : బీజేపీ నేత దిలీప్ విశ్వకర్మ