Ponguleti Srinivas Reddy: పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గం లో గెలిచిన 68 మంది సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మంత్రి పొంగిలేటి, ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగిలేటి మాట్లాడుతూ పేదవాడి ఆత్మగౌరవం అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం పట్టించుకోలేదన్నారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయకపోగా రాష్ట్రం మీద పడి కల్వకుంట్ల కుటుంబం, గత పాలకవర్గాలే రాష్ట్రం మీద పడి దోచుకున్నాయని ఆరోపించారు.
పదేళ్లలో పదివేల మందికి ఇండ్లు
పేదవాడి ఆత్మగౌరవం, చిరకాల స్వప్నం అయిన ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి వేయి చొప్పున ఇచ్చిన పదేళ్లలో పదివేల మందికి ఇండ్లు లభించేవన్నారు. సరి కదా నియోజకవర్గానికి 1000 మాట పక్కకు పెడితే కనీసం నియోజకవర్గానికి 10 ఇండ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఇందిరమ్మ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని ఉన్న ప్రతి పేదవాడి కళ నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఒక్క ఏడాది నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించడం వారు ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి దశలవారీగా ఇప్పటికే 80% బిల్లులు కేటాయించామన్నారు. గత ప్రబుద్ధుల పాలనలో ఇల్లు కట్టుకోవాలని ఉన్న పేదవాడి కళ నెరవేరకుండా పోయిందన్నారు.
Also Read: Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు
ప్రతి బీదవాడికి ఇల్లంందించాలని లక్ష్యం
సొల్లు కారుస్తూ మాట్లాడితే ప్రజలు కర్రు కార్చే వాత పెడతారు. ఎక్కడబడితే అక్కడే సొల్లు కారుస్తూ మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. రానున్న మూడేళ్లతోపాటు మరో ఐదేళ్ల తర్వాతనే అధికారం ఆశించే దిశగా కృషి చేయాలని, అడ్డగోలు సొల్లు మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వంలో పూర్తిగా మోసపోయిన పేదోడి ఇంటికలను ప్రజలు ఎన్నుకొని నిలబెట్టిన ప్రజాపాలన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను చేపడుతూ ప్రతి బీదవాడికి ఇల్లంందించాలని లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.
కాంగ్రెస్ సత్తా ఏంటో చూపించాం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ ప్రజల ఆశీస్సులతో ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఎవరైతే కొత్తగా సర్పంచ్లు గెలిచారో వారు కూడా ప్రజాసేవ చేసేందుకు సంసిద్ధులు కావాలన్నారు. కొత్తగా ఎన్నుకోబడిన వారు కూడా చాలా కోరికలతో చాలా ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఆనాడు దీవించారు. అశ్వరావుపేట నియోజకవర్గం లో 68 సర్పంచ్ స్థానాలను గెలిపించుకొని కాంగ్రెస్ సత్తా ఏంటో చూపించామన్నారు. ఇప్పటికే మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ఇకపైన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే నాలుగోసారి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సర్పంచులు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

