Samyuktha Menon: బీటెక్ చేయకపోవడం అదృష్టం.. సంయుక్తా
samyukta-menan
ఎంటర్‌టైన్‌మెంట్

Samyuktha Menon: బీటెక్ చేయకపోవడం అదృష్టం అంటున్న సంయుక్తా మీనన్.. ఎందుకంటే?

Samyuktha Menon: శర్వానంద్ హీరోగా రాబోతున్న “నారీ నారీ నడుమ మురారి” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ సంయుక్త మీనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ (B.Tech) చదువుపై ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సినిమా వేడుకల్లో నటీనటులు చెప్పే మాటలు అప్పుడప్పుడు చాలా ఆసక్తికరంగా, మరికొన్ని సార్లు సరదాగా సాగుతుంటాయి. తాజాగా ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ సంయుక్త మీనన్ చదువు, కెరీర్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Read also-Ram Charan: మెగాస్టార్ సినిమా చూసిన రామ్ చరణ్ ఏం అన్నారంటే?.. ఇది హైలెట్..

అందరూ బీటెక్ బాధితులేనా? తన మలయాళ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ సంయుక్త ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “నేను కేరళలో సినిమా చేస్తున్నప్పుడు సెట్‌లో ఉన్న దాదాపు అందరూ బీటెక్ చదివిన వారే ఉండేవారు. లైట్ బాయ్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరినీ అడిగితే బీటెక్ అని చెప్పేవారు. అసలు అందరూ ఎందుకు అదే చదివారు? అని నేను ఆశ్చర్యపోయి అడిగితే.. వారు ఇచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది” అని సంయుక్త అన్నారు. “జీవితంలో తర్వాత ఏం చేయాలో, ఏ కెరీర్ ఎంచుకోవాలో ఆలోచించడానికి సమయం కావాలి కాబట్టి.. ఆ గ్యాప్‌లో ఏం చేయాలో తెలియక అందరూ బీటెక్ లో జాయిన్ అయ్యామని వారు చెప్పారు” అంటూ సంయుక్త నవ్వుతూ చెప్పుకొచ్చారు. కేవలం డిగ్రీ కోసం కాకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించే ‘వెయిటింగ్ రూమ్’ లాగా ఇంజనీరింగ్‌ను వాడుకుంటున్నారనే అర్థంలో ఆమె చేసిన ఈ కామెంట్స్ అక్కడున్న వారందరినీ నవ్వించాయి.

Read also-Chiranjeevi Records: ‘మన శంకరవరప్రసాద్ గారు’ మొదటి రోజు కలెక్షన్లు ఇరగదీశారుగా.. ఎంతంటే?

నా అదృష్టం బాగుంది.. ఇదే క్రమంలో తన గురించి చెబుతూ.. “నేను బీటెక్ చేయలేదు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా అదృష్టం బాగుండి ఆ వైపు వెళ్లలేదు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత సమాజంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇతర రంగాల్లో స్థిరపడే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, సంయుక్త చేసిన ఈ కామెంట్స్ యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Just In

01

Prabhas Emotion: ‘ది రాజాసాబ్’లో ఈ సీన్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేరు.. ఏడిపించేశాడు భయ్యా

GHMC: గ్రేటర్‌లో ఈ-వేస్ట్ మెగా శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం.. ఐటీ ప్రాంతాల, ఆ షాపులపై జీహెచ్ఎంసీ ఫోకస్!

Ellamma Movie: బలగం వేణు రెండో సినిమా గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Kuchukulla Rajesh Reddy: ఆ జిల్లాలో పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి!

YS Sharmila: కోటిన్నర మంది మహిళలకు సీఎం చంద్రబాబు మోసం.. సంక్రాంతి వేళ వైఎస్ షర్మిల ఫైర్