Chiranjeevi Comeback: బాస్ కంబ్యాక్ ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో అప్పటి మెగాస్టార్ అభిమానులు థియేటర్లలో సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఏజ్ తో సంబంధం లేకుండా థియేటర్లు కళ కళలాడుతున్నాయి. మెగాస్టార్ చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ లుక్ తో రావడంతో మెగా అభిమానులు సంబారాలు చేసుకుంటున్నారు. అసలే సంక్రాంతి సీజన్ అందులో అందరికీ నచ్చే జానర్ లో సినిమా రావడంతో కుటుంబం అంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక సినిమా చూసి బయటకు వచ్చిన మెగాస్టార్ సీనియర్ ఫ్యాన్ థియేటర్లలోనే డాన్సులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అయితే సినిమా చూసి వచ్చిన తత్వాత ఎమోషన్ అవుతున్నారు.
Read also-Cheekatilo Trailer: శోభిత ధూళిపాళ్ల ‘చీకటిలో’ సినిమా ట్రైలర్ వచ్చింది చూశారా?
— MegaPower 🇮🇳 (@SandyDhanapala) January 11, 2026
స్టోరీ ఇదే..
శంకర వర ప్రసాద్ (చిరంజీవి) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఒక పవర్‌ఫుల్ ఆఫీసర్. వృత్తిరీత్యా ఎంతో కఠినంగా ఉండే ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక ‘డైవర్సీ’. భారతదేశపు అత్యంత ధనిక వ్యాపారవేత్త శశిరేఖ (నయనతార)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రసాద్, మనస్పర్థల వల్ల ఆమెకు దూరమవుతాడు. తన పిల్లలను అమితంగా ఇష్టపడే ప్రసాద్, తన కుటుంబాన్ని మళ్ళీ ఎలా కలుపుకున్నాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.
Ycp ,AA & MB fan's max Postive Talk vestunaru 🤣💥💥@KChiruTweets Rampage 🙏
Unanimous Talk Assalu 🔥🔥@AnilRavipudi #ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/cOOQyTDsfV
— YuvaSena 🚩 (@YuvaSena_1) January 12, 2026
అనిల్ రావిపూడి తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా పూర్తిస్థాయి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలిచారు. ముఖ్యంగా మెగాస్టార్‌లోని ‘వింటేజ్’ కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, ముఖ్యంగా ‘శశిరేఖ’ సాంగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నిడివి 2 గంటల 44 నిమిషాలు ఉన్నప్పటికీ, ఎడిటింగ్ షార్ప్‌గా ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఎక్కడా ల్యాగ్ లేకుండా వేగంగా సాగిపోయే కథనం, కామెడీ సీన్లు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ద్వితీయార్థంలో కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. విలన్ పాత్ర క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కొంచెం రొటీన్‌గా అనిపిస్తాయి.
ఏయ్…. 🕺🏻💃🏻🕺🏻💃🏻🍾
పెద్దవారంతా పూనకాలతో ఊగిపోతున్నారురో…….. 😂🥳🎉🥳బాసు @KChiruTweets …
ఇదీ నువ్వు సంపాదించుకున్న ఆస్తి…
పిల్లా జల్లా.. ముసలి ముతక… అని తేడా లేకుండా…ఒకటే గ్రేస్… దానికి ఒకడే బాస్…🔥🥳🔥#BlockbusterMSVPG#Manashankaravaraprasadgaaru pic.twitter.com/pE9fv2AhEK
— thaNOs™🐺 (@Thanos_Tweetss) January 12, 2026

