YouTube Controversy: ఏయ్ జూడ్‌కి వార్నింగ్ ఇచ్చిన అన్వేష్..
anvesh-warning
ఎంటర్‌టైన్‌మెంట్

YouTube Controversy: ఏయ్ జూడ్‌కి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన నా అన్వేషణ.. ఎందుకంటే?

YouTube Controversy: యూట్యూబ్ ట్రావెలర్ ‘నా అన్వేషణ’ (అన్వేష్), ‘ఏయ్ జూడ్’ (Aye Jude) మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా తన ప్రపంచ యాత్ర వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అన్వేష్, ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల వల్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సీతాదేవిపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వెనిజులా పర్యటనలో ఒక మైనర్ బాలికకు సంబంధించిన వీడియో ‘ఏయ్ జూడ్’ ఛానెల్‌లో రోస్టింగ్‌కు గురయ్యాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అన్వేష్ తనను ఫాలో అయ్యేవారు రోజు రోజుకు దూరం అయిపోతున్నారు. దీంతో కొంత బాధలో ఉన్నా.. దానికి కారణం అయిన ఏయ్ జూడ్ గురించి వీడియోలు పెడుతూనే ఉన్నారు.

Read also-The Raja Saab: ‘జననాయకుడు’ కూడా అదే రోజు వచ్చి ఉంటే.. ‘రాజా సాబ్’ పరిస్థితి ఏంటి?

వివాదానికి కారణాలు

వెనిజులాలో ఒక 14 ఏళ్ల బాలికకు సహాయం చేసిన వీడియోను అన్వేష్ అప్‌లోడ్ చేశారు. అయితే, ‘ఏయ్ జూడ్’ ఈ వీడియోను విశ్లేషిస్తూ.. ఆ బాలిక వయస్సు ఆ పరిస్థితుల్లో అన్వేష్ ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని చట్టపరంగా ‘పోక్సో’ (POCSO) పరిధిలోకి వచ్చే అంశంగా ఏయ్ జూడ్ తన వీడియోలో ప్రస్తావించారు.అన్వేష్ గతంలో హిందూ ధర్మం మరియు దేవతలపై చేసిన వ్యాఖ్యలను ఏయ్ జూడ్ ఎత్తిచూపారు. దీనికి సమాధానంగా అన్వేష్.. తాను ఇప్పటికే క్షమాపణలు చెప్పానని, ఏయ్ జూడ్ కావాలనే తనను ‘బత్తాయి’ అంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఏయ్ జూడ్ చేసిన విమర్శలకు అన్వేష్ తీవ్రంగా స్పందించారు. ఏయ్ జూడ్ ఫ్యామిలీ మెంబర్స్ (ప్రణీత్ హనుమంతు వివాదం) గురించి ప్రస్తావిస్తూ, “మీ ఇంట్లో ఇంత పెద్ద సమస్య ఉంటే నా మీద విమర్శలు చేస్తావా?” అని ప్రశ్నించారు. ఏయ్ జూడ్ భయపడే తన పాత వీడియోలను డిలీట్ చేశారని అన్వేష్ ఎద్దేవా చేశారు.

Read also-Sreeleela: ఇక శ్రీలీలకు మిగిలింది బాలీవుడ్డే.. కోలీవుడ్ కూడా శక్తి ఇవ్వలే!

అన్వేష్ వాదన

అన్వేష్.. తాను 130 దేశాలు తిరిగానని, ఒక ట్రావెలర్‌గా తనకు కనీస గౌరవం ఇవ్వాలని అన్వేష్ కోరుతున్నారు. తాను సంపాదించిన డబ్బులో దాదాపు 80 లక్షల రూపాయలను పేదలకు దానం చేశానని, తన మీద బురద చల్లడం మానుకోవాలని హెచ్చరించారు. 2026 నుంచి తన నోటి వెంట బూతులు రావని, తన జ్ఞానంతో విమర్శకులకు సమాధానం చెబుతానని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు యూట్యూబర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకవైపు అన్వేష్ తన ‘సింగిల్ ఆర్మీ’ పవర్‌ను చూపిస్తానంటుంటే, మరోవైపు ఏయ్ జూడ్ నెటిజన్ల మద్దతుతో అన్వేష్ వీడియోల్లోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఈ వివాదం చట్టపరమైన మలుపు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

Just In

01

Black Jaggery: యథేచ్చగా నల్ల బెల్లం దందా.. పోలీసులు విధులు నిర్వహిస్తారా? భేరసారాలకు తావిస్తారా?

Cheekatilo Trailer: శోభిత ధూళిపాళ్ల ‘చీకటిలో’ సినిమా ట్రైలర్ వచ్చింది చూశారా?

Malla Reddy: రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? తాగునీటి ఎద్దడిపై మల్లారెడ్డి ఫైర్!

TG Road Accidents: తెలంగాణలో రక్తంతో తడుస్తున్న రోడ్లు.. వామ్మో రోజుకు ఇన్ని మరణాలా..?

Venezuela – Trump: వెనిజువెలా అధ్యక్షుడిని నేనే.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!