The Raja Saab: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన మోస్ట్ అవేటెడ్ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్నే రాబట్టిన విషయం తెలిసిందే. జనవరి 9న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో మెప్పించలేక నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్‌తో కలెక్షన్స్ వస్తున్నప్పటికీ, లాంగ్ రన్‌లో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టడంపై టాలీవుడ్ సర్కిల్స్‌లో డౌట్సే వ్యక్తమవుతున్నాయి. నిజానికి ‘ది రాజా సాబ్’ విడుదల రోజే కోలీవుడ్ స్టార్ విజయ్ (Thalapathy Vijay) నటించిన ‘జననాయగన్’ (తెలుగులో ‘జననాయకుడు’) కూడా విడుదల కావాల్సి ఉంది. కొన్ని రాజకీయ కారణాలతో విజయ్ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇది ప్రభాస్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఒకవేళ విజయ్ సినిమా కూడా అదే రోజు పోటీకి వచ్చి ఉంటే, థియేటర్ల పంపకం నుంచి కలెక్షన్ల వరకు ‘ది రాజా సాబ్’ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. సోలో రిలీజ్ దొరకడం వల్ల నెగిటివ్ టాక్ ఉన్నా కూడా ఓపెనింగ్స్ పరవాలేదనిపించాయి.
Also Read- Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చిరు సినిమాకైనా గుర్తించినందుకు హ్యాపీ!
కలెక్షన్ల వేటలో ‘కొత్త సీన్లు’
సినిమాపై వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని, చిత్ర యూనిట్ తాజాగా కొన్ని కీలకమైన సీన్స్‌ను మూవీకి యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీన్ల వల్ల ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పెరిగి, ప్రస్తుతం కలెక్షన్స్ కాస్త నిలకడగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ వింటేజ్ లుక్స్, కామెడీ టైమింగ్‌ను ఇష్టపడే అభిమానులు థియేటర్లకు వస్తున్నప్పటికీ, సాధారణ ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులోనూ అసలు గండం ఇప్పుడే మొదలుకానుంది. సంక్రాంతి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకు అరడజను సినిమాలు క్యూ కడుతున్నాయి. చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ వరుసగా థియేటర్లలోకి దిగుతున్నాయి.
Also Read- Nari Nari Naduma Murari Trailer: ఒక హీరో, రెండు లవ్ స్టోరీస్.. పరిష్కారం లేని సమస్య!
చర్చలు మొదలు
ఈ సినిమాల ఎఫెక్ట్‌తో ‘ది రాజా సాబ్’కు థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. పండగ సినిమాల సందడి మొదలై, వాటికి మంచి టాక్ వస్తే మాత్రం ప్రభాస్ సినిమాను పట్టించుకునే వారే కరువవుతారు. ఆల్రెడీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్స్ పడ్డాయి. సోమవారం అఫీషియల్‌గా ఈ సినిమా థియేటర్లలోకి దిగుతోంది. ఇప్పటికే పడిన ప్రీమియర్స్‌కు మంచి టాక్ వస్తుంది. సో.. ప్రస్తుతానికి కలెక్షన్స్ నెట్టుకొచ్చినా, సంక్రాంతి పోటీని తట్టుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా? లేక ప్రభాస్ కెరీర్‌లో మరో యావరేజ్ సినిమాగా మిగిలిపోతుందా? అనేలా అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

