Sreeleela: టాలీవుడ్‌లో డ్యాన్సింగ్ క్వీన్‌గా మెరుపు వేగంతో దూసుకొచ్చిన ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీల (Sreeleela) కెరీర్ ఇప్పుడు అనుమానాల్లో పడింది. తెలుగులో వరుసగా ఎదురైన పరాజయాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, తాజాగా కోలీవుడ్‌పై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీగా ఉన్న శ్రీలీలకు, గత ఏడాది కాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా ప్లాప్స్ పలకరించడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తమిళ చిత్ర పరిశ్రమ (Kollywood) వైపు అడుగులు వేసింది. ఆమె నటించిన భారీ చిత్రం ‘పరాశక్తి’ (ParaSakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా రూపుదిద్దుకుని భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో కోలీవుడ్ కూడా ఆమె కెరీర్‌కు సరైన బూస్ట్ ఇవ్వలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.
Also Read- Super Star Krishna: మనవడు జయకృష్ణ ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం.. ఎక్కడంటే?
మిగిలింది బాలీవుడ్డే!
రెండు భాషల్లోనూ దెబ్బ తగలడంతో ఇప్పుడు శ్రీలీలకు బాలీవుడ్ ప్రాజెక్టులే కీలకంగా మారాయి. హిందీలో ఆమె చేస్తున్న భారీ చిత్రాలు సక్సెస్ అయితేనే ఆమె స్టార్ స్టేటస్ నిలబడుతుంది. అక్కడ కనీసం ఒక్క హిట్ పడినా, మళ్లీ సౌత్ మార్కెట్‌లో తన సత్తా చాటొచ్చని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ బాలీవుడ్ స్క్రీన్ పైనే ఉన్నాయి. మరి అక్కడి ప్రేక్షకులు ఈ భామను ఆదరిస్తారా? బాలీవుడ్ అయినా ఆమెకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందా? అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బూస్ట్ కోసం వెతుకుతున్న శ్రీలీలకు బాలీవుడ్ ఏ మేరకు అండగా నిలుస్తుందో వేచి చూడాలి. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమెకు మంచి మంచి అవకాశాలు వస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. బాలీవుడ్‌లో దాదాపు 3 సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్లుగా సమాచారం. వీటిలో ఏ ఒక్కటి సక్సెస్ అయినా, కొన్నాళ్ల పాటు ఆమెకు తిరుగుండదు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Also Read- Nari Nari Naduma Murari Trailer: ఒక హీరో, రెండు లవ్ స్టోరీస్.. పరిష్కారం లేని సమస్య!
పవన్ కళ్యాణ్‌పైనే హోప్స్
టాలీవుడ్‌లో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే ఆమె హోప్స్ పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే మాత్రం.. మరోసారి శ్రీలీల వెనుక టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రం ఆమె తన డ్యాన్సింగ్ టాలెంట్‌లోనే లాక్కొస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

