Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Advisory Yousefguda (Image Source: X)
Telangana News

Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?

Traffic Advisory: యూసఫ్‌గూడ వైపు ప్రయాణించే వాహనదారులకు సోమవారం ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసుల కొన్ని సూచనలు చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయని, ఈ సమయంలో ట్రాఫిక్‌ను వేరే దారులకు మళ్లీస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. యూసఫ్‌గూడలోని శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం (Shri Kotla Vijaya Bhaskar Reddy Indoor Stadium)లో సోమవారం (జనవరి 12న) తెలంగాణ పోలీసులు ‘అరైవ్ అలైవ్’ (రోడ్డు భద్రత అవగాహన) కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. దీనికి విద్యార్థులు, ప్రజలు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా పలు మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

Also Read- Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చిరు సినిమాకైనా గుర్తించినందుకు హ్యాపీ!

మళ్లింపులు ఇలా ఉండనున్నాయి

మైత్రివనం నుంచి బోరబండ వైపు: మైత్రివనం జంక్షన్ నుంచి యూసఫ్‌గూడ బస్తీ, రహమత్‌నగర్, బోరబండ బస్ స్టాప్ వైపు వెళ్లే వాహనాలను.. యూసఫ్‌గూడ బస్తీ వద్ద మళ్లించి.. కృష్ణకాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, కళ్యాణ్ నగర్, మోతీ నగర్ మీదుగా బోరబండ బస్ స్టాప్ వైపు పంపిస్తారు.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు: మైత్రివనం జంక్షన్ నుంచి యూసఫ్‌గూడ చెక్ పోస్ట్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్ వెళ్లే వారిని యూసఫ్‌గూడ బస్తీ వద్ద మళ్లించి.. ఆర్బీఐ (RBI) క్వార్టర్స్, కృష్ణా నగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు అనుమతిస్తారు.

స్టేడియం వైపు వచ్చే వాహనాలు: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి నుంచి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వచ్చే వాహనాలను కృష్ణా నగర్ జంక్షన్ వద్ద మళ్లించి.. శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట వైపు పంపిస్తారు.

బోరబండ నుంచి మైత్రివనం వైపు: బోరబండ బస్ స్టాప్ నుంచి కార్మికనగర్, యూసఫ్‌గూడ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను.. శ్రీరామ్ నగర్ చౌరస్తాలోని ప్రైమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద మళ్లించి.. మిడ్‌ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కళ్యాణ్ నగర్ జంక్షన్, వెంగళరావునగర్, ఉమేష్ చంద్ర విగ్రహం (యూ టర్న్), ఐసీఐసీఐ (యూ టర్న్) మీదుగా మైత్రివనం జంక్షన్ వైపు పంపిస్తారు. వాహనదారులు ఈ మార్పులను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

Also Read- Super Star Krishna: మనవడు జయకృష్ణ ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం.. ఎక్కడంటే?

పార్కింగ్

ఇక ఈ కార్యక్రమానికి వచ్చేవారు తమ వాహనాలను యూసఫ్‌గూడలోని టీజీఎస్పీ (TGSP) బెటాలియన్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Raja Saab: ‘జననాయకుడు’ కూడా అదే రోజు వచ్చి ఉంటే.. ‘రాజా సాబ్’ పరిస్థితి ఏంటి?

Sreeleela: ఇక శ్రీలీలకు మిగిలింది బాలీవుడ్డే.. కోలీవుడ్ కూడా శక్తి ఇవ్వలే!

Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇకపై అలాంటి సినిమాలు చేయదట!

Meenakshi Chaudhary: నాకు హీరో ఎవరనేది ముఖ్యం కాదు.. అదే ముఖ్యం!

Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?