KTR: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని ఆరోపించారు. పారిశుద్ధ్యం మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
హైదరాబాద్‌లో శనివారం ఖమ్మం(Khammam), నిజామాబాద్(Nizamavad) ఉమ్మడి జిల్లాల పార్టీ శ్రేణులతో మున్సిపల్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మాట్లాడుతూ, గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి కూడా లేదన్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు(Roads), కమ్యూనిటీ హాల్స్(Community Hals), మోడల్ మార్కెట్ల వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతూ, మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతున్నదన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ఇచ్చిన నిధులను వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ చేశారు.
Also Read: Ayodhya Ram Temple: షాకింగ్.. అయోధ్య రామమందిరంలో నమాజ్ చేసేందుకు కశ్మీరీ వ్యక్తి ప్రయత్నం
పురపాలక ఎన్నికల్లో
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫున చేసుకోవాల్సిన ఏర్పాట్లను, ప్రజల ముందు ఉంచాల్సిన వివిధ అంశాలను కేటీఆర్ వివరించారు. రెండు జిల్లాలకు సంబంధించిన ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితుల పైన క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) పలు అంశాల పైన నేతలకు దిశానిర్దేశం చేశారు. కలిసికట్టుగా కొట్లాడి ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన పలు అంశాలను నేతలకు వివరించారు. ఆయా జిల్లాల నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు వివరించారు. ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని పార్టీకి అనుకూల వాతావరణ ఉన్నదని తెలిపారు.
Also Read: Audience Mindset: ప్రేక్షకులు సినిమా చూసే కోణం మారుతుందా?.. వారు ఏం కోరుకుంటున్నారు?

