Chiranjeevi Balakrishna: చిరంజీవి, బాలయ్య మధ్య తేడా అదే..
anil-ravipudi-about-chiru-balayya
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi Balakrishna: చిరంజీవి, బాలయ్య బాబు మధ్య తేడా అదే.. అనిల్ రావిపూడి..

Chiranjeevi Balakrishna: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు వంటి వారు. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ ఇద్దరు దిగ్గజ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన అరుదైన అవకాశం డైరెక్టర్ అనిల్ రావిపూడికి దక్కింది. బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ వంటి హిట్ కొట్టిన అనిల్, ఇప్పుడు చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో, వీరిద్దరి పనితీరు వ్యక్తిత్వాల మధ్య ఉన్న తేడాలను అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Read also-Anvesh Controversy: పరువు మొత్తం పోగొట్టకున్న యూట్యూబర్ అన్వేష్.. ఏం అన్నాడంటే?

అనిల్ రావిపూడి అభిప్రాయం ప్రకారం, చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ భిన్నమైన ధ్రువాలు. వారి జీవనశైలి, సెట్‌లో మలిగే విధానం పూర్తిగా వేర్వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. బాలయ్య తనదైన మాస్ మేనరిజమ్స్‌తో, ఎనర్జీతో సెట్‌ను ఉత్సాహపరుస్తుంటే, చిరంజీవి గారు ఎంతో ప్రశాంతంగా, అనుభవంతో కూడిన హుందాతనంతో వ్యవహరిస్తారని అనిల్ పేర్కొన్నారు. ఈ ఇద్దరినీ ఒకే కోణంలో పోల్చడం సాధ్యం కాదని, వారి రూట్లే వేరని ఆయన స్పష్టం చేశారు. తేడాలు ఎన్ని ఉన్నా, వారిద్దరిలో ఉన్న ఒక గొప్ప సమానమైన లక్షణం ‘దర్శకుడికి ఇచ్చే గౌరవం’. ఈ విషయంలో ఇద్దరూ ఒకేలా ఉంటారని అనిల్ కొనియాడారు. “బాలయ్య బాబు డైరెక్టర్‌ను విపరీతంగా రెస్పెక్ట్ చేస్తారు. చిరంజీవి గారు కూడా అంతే. నన్ను ఇద్దరూ చాలా బాగా చూసుకున్నారు” అని అనిల్ చెప్పుకొచ్చారు. దర్శకుడు ఏం చెబితే అది చేయడానికి, కథపై నమ్మకం కుదిరిన తర్వాత పూర్తిగా సహకరించడానికి వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన తెలిపారు.

Read also-Mass Maharaja: ‘మాస్ మహారాజ్’ బిరుదు పేటెంట్ తనదే అంటున్న హరీష్ శంకర్.. రవితేజ ఏం చేశారంటే?

చిరంజీవితో పనిచేస్తున్నప్పుడు ఆయన 150 సినిమాల అనుభవం ఎక్కడా ఒత్తిడిగా అనిపించలేదని అనిల్ అన్నారు. ఏదైనా మార్పు కావాలనిపిస్తే చాలా సున్నితంగా, లాజికల్‌గా చర్చిస్తారని, ఒకసారి దర్శకుడి వివరణ నచ్చితే “సరే అమ్మ.. చేసేద్దాం” అని పూర్తి స్వేచ్ఛను ఇస్తారని చెప్పారు. అటు బాలయ్య కూడా దర్శకుడి విజన్‌ను నమ్మి, తన ఇమేజ్‌ను పక్కన పెట్టి పాత్రలో ఒదిగిపోతారని ‘భగవంత్ కేసరి’ సమయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గ్లామర్, టైమింగ్ ఒక ఎత్తు అయితే.. బాలయ్య బాబు ఎనర్జీ, పవర్ మరొక ఎత్తు. ఈ ఇద్దరు అగ్ర హీరోలతో పనిచేయడం తన కెరీర్‌లో దక్కిన గొప్ప గౌరవంగా అనిల్ భావిస్తున్నారు. టెక్నీషియన్ల పట్ల వారు చూపే ఆదరణే వారిని ఇన్ని ఏళ్లపాటు లెజెండ్స్‌గా నిలబెట్టిందని ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా విశ్లేషించారు. మెగా, నందమూరి అభిమానులకు ఈ విశ్లేషణ ఇప్పుడు ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.

Just In

01

The Raja Saab: ‘జననాయకుడు’ కూడా అదే రోజు వచ్చి ఉంటే.. ‘రాజా సాబ్’ పరిస్థితి ఏంటి?

Sreeleela: ఇక శ్రీలీలకు మిగిలింది బాలీవుడ్డే.. కోలీవుడ్ కూడా శక్తి ఇవ్వలే!

Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇకపై అలాంటి సినిమాలు చేయదట!

Meenakshi Chaudhary: నాకు హీరో ఎవరనేది ముఖ్యం కాదు.. అదే ముఖ్యం!

Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?