Akhanda 2: ‘అఖండ 2’కు చినజీయర్ స్వామి ప్రశంసలు..
akhanda-2
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2: ‘అఖండ 2’కు చినజీయర్ స్వామి ప్రశంసలు.. ధర్మాన్ని రక్షించే సినిమా

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ-2’ చిత్రం ఆధ్యాత్మిక, సామాజిక అంశాల కలయికతో విశేష ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ చిత్రం ఆధ్యాత్మిక గురువుల ప్రశంసలను అందుకుని వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక ప్రదర్శనలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామివారు మరియు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిలం స్వామివారు సుమారు 400 మంది వేద పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. ఒక కమర్షియల్ సినిమాను ఇంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు వీక్షించడం చిత్ర విజయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

Read also-Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’ ఆఫర్‌ వదులుకున్న అనిల్ రావిపూడి.. అసలు కారణం ఇదే!

సినిమాపై చినజీయర్‌ స్వామివారి ప్రశంసలు

సినిమా వీక్షించిన అనంతరం చినజీయర్‌ స్వామివారు దర్శకుడు బోయపాటి శ్రీనుని ప్రత్యేకంగా అభినందించి, ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా స్వామివారు చేసిన వ్యాఖ్యలు సినిమాలోని అంతరార్థాన్ని తెలియజేశాయి. సనాతన హైందవ ధర్మాన్ని నేటి తరానికి అర్థమయ్యేలా, అత్యంత శక్తివంతంగా తెరకెక్కించారని స్వామివారు కొనియాడారు. కేవలం వినోదం కోసమే కాకుండా, సమాజానికి అవసరమైన ఒక బాధ్యతతో కూడిన సందేశాన్ని ఈ చిత్రంలో అందించారని ప్రశంసించారు. చిత్రంలో బాలకృష్ణ పోషించిన పాత్రలోని గాంభీర్యం, ఆయన చేసిన ‘అఖండ తాండవం’ వెండితెరపై ధర్మాన్ని రక్షించే శక్తిలా కనిపించిందన్నారు.

Read also-The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

చిత్ర విశేషాలు

‘అఖండ’ మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఈ సీక్వెల్ మరింత భారీ స్థాయిలో రూపొందింది. ప్రకృతిని, ధర్మాన్ని విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలను బోయపాటి తనదైన శైలిలో చూపించారు. ముఖ్యంగా వేద పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఈ సినిమా ప్రదర్శించబడటం, వారికి కూడా ధర్మ రక్షణ అనే అంశంపై స్పూర్తినిచ్చేలా ఉందని నిర్వాహకులు భావించారు. ఆధ్యాత్మిక విలువలని, సామాజిక బాధ్యతని కమర్షియల్ హంగులతో జోడించి తీసిన ‘అఖండ-2’ కేవలం అభిమానులనే కాకుండా, పీఠాధిపతులను, ఆధ్యాత్మిక వేత్తలను సైతం మెప్పించడం విశేషం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కళారూపాలు ఎలా ఉపయోగపడాలో ఈ చిత్రం నిరూపించిందని చినజీయర్‌ స్వామివారు ఆశీర్వచనాలు అందించారు. దీంతొ సినమాకు మరింత గౌరవం దక్కింది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు చేసి, ప్రస్తుంతం ఓటీటీలో టాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Just In

01

The Raja Saab: ‘జననాయకుడు’ కూడా అదే రోజు వచ్చి ఉంటే.. ‘రాజా సాబ్’ పరిస్థితి ఏంటి?

Sreeleela: ఇక శ్రీలీలకు మిగిలింది బాలీవుడ్డే.. కోలీవుడ్ కూడా శక్తి ఇవ్వలే!

Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇకపై అలాంటి సినిమాలు చేయదట!

Meenakshi Chaudhary: నాకు హీరో ఎవరనేది ముఖ్యం కాదు.. అదే ముఖ్యం!

Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?