Jana Nayagan: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పూర్తి చేసుకుని ప్రచారంలో బిజీగా ఉన్నారు. విజయ్ దళపతి గోట్ మూవీ సమయంలో విజయ్ చివరి సినిమాకు సంబంధించిన చివరి సినిమా ప్రాజెక్ట్ ‘జన నాయగన్’ తన వద్దకు వచ్చిందని, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించి వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ‘జన నాయగన్’ సినిమా జనవరి 9, 2026న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ విషయమై పోస్ట్ పోన్ అయింది. దీని గురించి స్వయంగా నిర్మాత మాట్లాడుతూ తను ఏం చేయలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చారు.
Read also-Anvesh Controversy: పరువు మొత్తం పోగొట్టకున్న యూట్యూబర్ అన్వేష్.. ఏం అన్నాడంటే?
విజయ్ నుండి పిలుపు..
విజయ్ తన కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు, ఒక బలమైన రీమేక్ కథతో సినిమా చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ కోసం అనిల్ రావిపూడిని సంప్రదించారు. విజయ్ లాంటి పెద్ద స్టార్ నుండి, అది కూడా ఆయన ఆఖరి సినిమా కావడంతో ఎవరైనా వెంటనే ఓకే చెబుతారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం దీనిని సున్నితంగా తిరస్కరించారు.
రీమేక్ వద్దు..
అనిల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ‘స్ట్రెయిట్ సబ్జెక్ట్’ పై ఆయనకున్న మక్కువ. విజయ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నటుడితో సినిమా చేసే అవకాశం వస్తే, అది తన సొంత కథతో, ఒక స్ట్రెయిట్ తెలుగు/తమిళ ప్రాజెక్ట్‌గా ఉండాలని ఆయన కోరుకున్నారు. రీమేక్ చేయడం వల్ల ఒరిజినల్ సినిమాతో పోలికలు వస్తాయని, ఒక క్రియేటివ్ డైరెక్టర్‌గా తన మార్కును పూర్తిగా చూపించలేనని భావించి ఆయన ఆ ఆఫర్‌ను వదులుకున్నారు.
Read also-Vidyut Jammwal: నగ్నంగా చెట్టు ఎక్కిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్.. నెటిజన్లు ఏం చేశారంటే?
మెగాస్టార్‌తో సంక్రాంతి సందడి
విజయ్ సినిమాను వదులుకున్నా, అనిల్ రావిపూడికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఆయన చిరంజీవితో చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాతో అనిల్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నారు. విజయ్‌తో సినిమా మిస్ అయినా, భవిష్యత్తులో సరైన స్ట్రెయిట్ కథ దొరికితే కచ్చితంగా కలిసి పని చేస్తానని అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. విజయ్ తన రాజకీయ ప్రయాణం కోసం సినిమాలకు స్వస్తి చెబుతున్న తరుణంలో, ఆయన ఆఖరి సినిమా ఆఫర్‌ను తిరస్కరించడానికి ఎంతటి ధైర్యం ఉండాలో అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

