Ponguleti Srinivas Reddy: జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి ఆ వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas reddy) అన్నారు. ఏ ఒక్కరి గౌరవాన్ని తగ్గించాలని గాని, చిన్నబుచ్చాలనిగాని తమ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. జీవో 252 పై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
సుమారు 23వేల..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమావేశంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని వారు ప్రస్తావించిన అంశాలను విజ్ఞప్తులను పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న సుమారు 23వేల అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య కంటే ఈ సారి ఇచ్చే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంటుందని వెల్లడించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటివరుసలో ఉందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే సదుద్దేశంతో శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం చేయడం జరిగిందని పలుమార్లు సమావేశాలు నిర్వహించామన్నారు.
Also Read: Pawan Kalyan: హైపర్ ఆదిని సత్కరించిన పవన్ కళ్యాణ్.. విషయం ఏంటంటే?
రాష్ట్రంలో మండలానికో విలేకరి
అంతేగాక దేశ వ్యాప్తంగా ఉన్ననియమ నిబంధనలను పరిశీలించడం జరిగిందని ఫలితంగా కొత్త కార్డుల మంజూరులో కొంత జాప్యం జరిగిందని అన్నారు. మీడియా కార్డుకు, అక్రిడిటేషన్ కార్డుకు ఎలాంటి వ్యత్యాసం లేదని అక్రిడిటేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పరంగా అందే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా అందుతాయని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని మరోమారు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో మండలానికో విలేకరి ప్రాతిపదికన గాక జనాభా వారీగా అక్రిడిటేషన్‌లు మంజూరు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంలో కూడా ఆలోచిస్తామని, దీనిపై పాత్రికేయ సంఘాలు స్పందించాలని అన్నారు. మరోవైపు జర్నలిస్టుల ఇండ్ల స్ధలాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామన్నారు. ఈసమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, ఐ,పిఆర్ కమీషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Fake Reviews: నెగిటివ్ రివ్యూ ఇచ్చేవారికి బిగ్ షాక్ ఇచ్చిన మెగాస్టార్ మూవీ టీం.. ఏం చేశారంటే?

