Vidyut Jammwal: బాలీవుడ్ యాక్షన్ హీరో, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. విద్యుత్ జమ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నగ్నంగా ఒక చెట్టును ఎక్కుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ చర్య వెనుక ఒక ఆధ్యాత్మిక మరియు శారీరక కోణం ఉందని ఆయన వివరించారు. తాను ఒక కలరిపయట్టు సాధకుడిగా, ప్రతి సంవత్సరం ఒకసారి ఇలా ‘సహజ యోగా’ సాధన చేస్తానని తెలిపారు. మన పుట్టుక ఎలా జరిగిందో, అదే సహజ స్థితిలో ప్రకృతికి దగ్గరగా వెళ్లడం వల్ల మన అంతరాత్మతో మమేకం కావచ్చని ఆయన భావన. హిమాలయాల్లో ఇలా ప్రకృతితో గడపడం తన అలవాటని ఆయన గతంలోనూ చెప్పారు.
Read also-The RajaSaab: రెస్టారెంట్లో ప్లే అవుతున్న ‘ది రాజాసాబ్’.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. ఎక్కడంటే?
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన ఫిట్‌నెస్‌ను, ప్రకృతి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక యోగిలా ఆయన ఆలోచనా విధానం బాగుందని కామెంట్ చేస్తున్నారు. మెజారిటీ నెటిజన్లు ఈ చర్యను చూసి షాక్ అయ్యారు. “కనీసం ఆకులైనా కట్టుకోవాల్సింది”, “ఇలాంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవసరమా?” అని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు దీనిపై జోకులు పేలుస్తున్నారు.
Read also-Fake Reviews: నెగిటివ్ రివ్యూ ఇచ్చేవారికి బిగ్ షాక్ ఇచ్చిన మెగాస్టార్ మూవీ టీం.. ఏం చేశారంటే?
విద్యుత్ జమ్వాల్ ఫిట్‌నెస్ నేపథ్యం
విద్యుత్ జమ్వాల్ ప్రపంచంలోని అగ్రశ్రేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన భారతీయ పురాతన యుద్ధ విద్య కలరిపయట్టును ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన చేసే విన్యాసాలు, కఠినమైన శిక్షణ తరచుగా వైరల్ అవుతుంటాయి. విద్యుత్ జమ్వాల్ ఇలాంటి సాహసోపేతమైన పనులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా గడ్డకట్టే మంచు నీటిలో స్నానం చేయడం, భూమిలో కూరుకుపోయి ధ్యానం చేయడం వంటి వీడియోలను పంచుకున్నారు.

