The RajaSaab: ప్రభాస్ అభిమానులు సంతృప్తి చెందలేదు.. మారుతి
maruthi-press-meet
ఎంటర్‌టైన్‌మెంట్

The RajaSaab: ప్రభాస్ అభిమానులు సంతృప్తి చెందలేదంటున్న దర్శకుడు మారుతి.. ఎందుకంటే?

The RajaSaab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ మొదటి రోజు రూ.112 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా మూవీ టీం థ్యాక్స్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. సినిమా అభిమానులకు నచ్చింది అని నేను అనుకోను, అసలు నచ్చలేదు అని కూడా అనుకోను ఎందుకంటే.. సినిమా డిఫరెంట్ జోనర్ లో తీయడం వల్ల కొంత మందికి అర్థం అయిఉండదు. అందుకే అలాంటి మాటలు వస్తున్నాయి. అర్థం చేసుకుంటే.. సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఒక రోజులు ప్రక్షకులకు ఎక్కేది కాదు కొంచెం టైం అడుతోంది. పది రోజుల తర్వాత చూడండి సినిమా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా చాలా నచ్చుతుంది, అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా కొంత మందికి అసలు అర్థం కాలేదని అందుకు చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారని, సినిమా చూసి చాలా మంది నాకు కాల్ చేసి చాలా బాగుందని చెప్పారన్నారు.

Read also- Fake Reviews: నెగిటివ్ రివ్యూ ఇచ్చేవారికి బిగ్ షాక్ ఇచ్చిన మెగాస్టార్ మూవీ టీం.. ఏం చేశారంటే?

అంతే కాకుండా.. మిడ్ రేంజ్ డైరెక్టర్ అయిన నాకు ప్రభాస్ గారితో సినిమా చేశాననే క్రెడిట్ దక్కడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన ప్రభాస్ గారికి జన్మంతా రుణపడి ఉంటానన్నారు. ఇవే కాకుండా మరిన్ని విషయాలు ఇలా చెప్పుకొచ్చారు.. ‘9 నెలలకో సినిమా చేసే నేను మూడేళ్లు కష్టపడి ఈ సినిమాను రూపొందించాను. ప్రభాస్ గారిని మీరు ఎలా చూడాలనకుంటున్నారో అలా తెరకెక్కించాను. సినిమా చూసిన వాళ్లు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఒక కమర్షియల్ హీరోతో ఇలాంటి మైండ్ గేమ్ సినిమా రాలేదని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ 40 నిమిషాల ఎపిసోడ్ కు వరల్డ్ వైడ్ అందరు ప్రశంసిస్తున్నారు. కొత్త పాయింట్ తో వచ్చిన సినిమా ఒక్క రోజుకే అందరికీ నచ్చి పెద్ద హిట్ కాదు. కొత్త పాయింట్ ఎప్పుడైనా ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు కొంత టైమ్ తీసుకుంటుంది. మేము చెప్పాలనుకున్న కొత్త పాయింట్ పై ఇంటలెక్చువల్స్ ఒకలా మాట్లాడుతున్నారు. అర్థం కాని వాళ్లు తిడుతున్నారు. రకరకాల రెస్పాన్స్ లు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అప్పుడే ఒక సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయొద్దు. ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ గారిని ట్రైలర్ లోనే పరిచయం చేశాం. ఆయన స్వాగ్, గెటప్, మేనరిజమ్ చూపించాం, థియేటర్స్ లోకి వచ్చేసరికి ఆ ప్రభాస్ గారి సీన్స్ ఏవి అని ప్రేక్షకులు వెతుక్కున్నారు. ఆ క్రమంలో మేము చూపించే కథకు వారు కనెక్ట్ కాలేకపోయారు. చాలా మంది ప్రభాస్ గారి అభిమానులు నాతో మాట్లాడారు. సినిమా బాగా చేశావన్నా అని అన్నారు. ఓల్డ్ గెటప్ సీన్స్ వస్తే బాగుంటుందన్నా అన్నారు. వారి సూచన మేరకు ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ సీన్స్ ను యాడ్ చేశాం. ఈ రోజు సాయంత్రం షోస్ నుంచి ఆ సీన్స్ రాజా సాబ్ మూవీలో చూస్తారు. రూఫ్ మీద ఫైట్ ఇప్పటిదాకా రాలేదు. 8 నిమిషాల ఆ ఫైట్ లో ప్రభాస్ గారి స్వాగ్, స్టైల్ ను ఇవాళ్టి నుంచి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైతే కొందరు లెంగ్త్, ల్యాగ్ అని ఫీలయ్యారో వాటిని షార్ప్ చేశాం. ఈ రోజు సాయంత్రం షోస్ నుంచి రియల్ రాజా సాబ్ గా నేను ఫీలయిన ప్రభాస్ గారిని స్క్రీన్స్ మీద చూపించబోతున్నాం. దీంతో ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారని నమ్ముతున్నాను. సంక్రాంతికి వస్తున్న అన్ని మూవీస్ ఆదరణ పొందాలి. రాజా సాబ్ సినిమా చూసి నా డైరెక్టర్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించారు. నేను హ్యాపీగా ఉన్నాను. నార్మల్ రేట్స్ కే రాజా సాబ్ సినిమాను మీరు థియేటర్స్ లో చూడొచ్చు. అంటూ మీట్ లో చెప్పుకొచ్చారు.

Read also-Dandora OTT Release: ‘దండోరా’ వేస్తూ ఓటీటీలోకి వచ్చేస్తోన్న శివాజీ సినిమా.. ఎప్పుడంటే?

Just In

01

Ind Vs NZ 1st ODI: తడబడినా తేరుకున్న కివీస్ బ్యాటర్లు.. తొలి వన్డేలో భారత్‌ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

PK Martial Arts Journey: టైగర్.. పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు!

Excise Scandal: కల్తీ మద్యం కేసులో.. ఎక్సైజ్ చేతివాటంపై కలకలం

Murder Case: భర్త హత్యను కళ్లారా చూసింది.. ఆ కేసుపై విచారణ జరుగుతుండగా ఊహించని ఘోరం

Huzurabad News: పల్లె ప్రకృతి వనంలో పొంచి ఉన్న మృత్యువు.. హైటెన్షన్ వైర్లతో అల్లుకున్న వనం..!