Dandora OTT Release: ఒకప్పటి ఫ్యామిలీ హీరో ఇప్పడు బిగ్‌బాస్ రియాలిటీ షోతో తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్న నటుడు శివాజీ. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే నవదీప్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘దండోరా’. ఇప్పటికే ఈ సినిమా థియోటర్లలో మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 14, 2026 నుంచి అమెజాన్ పైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం శివాజీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మురళి కాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సమాజంలో జరిగే కొన్ని ముఖ్యమైన పరిణామాల చుట్టూ కథాంశం తిరుగుతుంది. అప్పుడు థియోటర్ లో చూడలేని వారుకి ఇపుడు ఇది మంచి చాన్స్. శివాజీ తన మార్క్ నటనతో సీరియస్ లుక్‌లో కనిపించగా, నవదీప్, నందు, రవికృష్ణలు కీలక పాత్రల్లో కనిపించారు.
Read also-Jaya Krishna: ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. అదరగొడుతున్న ఘట్టమనేని వారసుడు..
కథేంటంటే..
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (మెదక్ జిల్లా)లోని ఒక గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఆ ఊరిలో కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్రకులానికి చెందిన శివాజీ తన కులం గౌరవమే ప్రాణంగా బతుకుతుంటాడు. అయితే అతని కూతురు సుజాత (మౌనిక), అదే ఊరికి చెందిన తక్కువ కులానికి చెందిన రవి (రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన కుల పెద్దలు పరువు కోసం రవిని చంపేస్తారు. ఆ బాధతో సుజాత కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. తన కళ్ళ ముందే కూతురు చనిపోవడంతో శివాజీలో ఎలాంటి మార్పు వచ్చింది? తన పంతం వల్ల కుటుంబాన్ని ఎలా కోల్పోయాడు? ఆ తర్వాత బిందు మాధవి పాత్ర ద్వారా అతని జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేదే ఈ సినిమా మిగిలిన కథ.
Read also-Anasuya Post: ఏంట్రా ఇలా ఉన్నారు!.. ఎవరు యూటర్న్ తీసుకుంది?.. అనసూయ..
దర్శకుడు మురళీకాంత్ ఎంచుకున్న పాయింట్ కొత్తది. సాధారణంగా సినిమాల్లో తక్కువ కులం వారు బాధితులుగా చూపిస్తారు, కానీ ఇక్కడ బాధితుడు అగ్ర కులానికి చెందిన శివాజీ కావడం ఒక కొత్త కోణం. మార్క్ కె. రాబిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. పాటల కంటే రీ-రికార్డింగ్ చాలా బాగుంది. వెంకట్ ఆర్. శాఖమూరి 2004 నాటి తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా కెమెరాలో బంధించారు. అయితే ఇదే సినిమా విషయంలో శివాజీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు ప్రభావం సినిమాపై మాత్రం పడలేదు.

