Jaya Krishna: సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు ప్రిన్స్ మహేష్ బాబు. ఇప్పటికే అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ విడుదల కావడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘ఘట్టమనేని’ కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ లెగసీని మహేష్ బాబు అగ్రస్థానంలో నిలబెట్టగా, ఇప్పుడు అదే కుటుంబం నుండి మరో యువకెరటం జయ కృష్ణ ఘట్టమనేని ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Read also-The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి రోజు కింగ్ సైజ్ కలెక్షన్స్ ఎంతంటే?.. అఫిషియల్..
లవ్ స్టోరీ..
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న విజనరీ డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణను ఒక ‘రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ’ ద్వారా ఆయన వెండితెరకు పరిచయం చేస్తుండటం విశేషం. మరో విశేషమేమిటంటే, టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ (వైజయంతి మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం పూర్తి సంతృప్తిగా ఉన్నట్లుగా ఈ అప్డేట్‌లో తెలిపారు. త్వరలోనే జయకృష్ణ లుక్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని (Rasha Thadani) హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.
Read also-BMW Heroines: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. హీరోయిన్లు యమా హుషారుగా ఉన్నారుగా!
Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗
Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.
A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026

