Rajaiah Slams Kadiyam Srihari: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య (MLA Rajaiah) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కడియం అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టు తన సృష్టేనని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఆ దేవాదుల పైనే తాను పిండాలు పెట్టి వచ్చానని ఎద్దేవా చేశారు. తాను చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవడం కడియంకు తగదని రాజయ్య పేర్కొన్నారు.
సత్తా ఏంటో నిరూపిస్తాం
నియోజకవర్గంలో రూ. 800 కోట్లు, 1400 కోట్లు అంటూ కడియం చెప్పుకుంటున్నవన్నీ తన హయాంలో జరిగిన పనులేనని రాజయ్య స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాడోపేడో తెలుసుకుందాం అని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌కు ఉన్న బలం ఏంటో, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలలో నిరూపించామని గుర్తు చేశారు. ఇప్పటికైనా మాపై విమర్శలు చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదని రాజయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో బంగ్లా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సురేష్, నర్సింహారెడ్డి, కుమార్, మల్లేశం, హిరాసింగ్, అశోక్, పావని, గణేష్‌లతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Also Read: Thatikonda Rajaiah: కడియం శ్రీహరిని ఓ రేంజ్‌లో ఆడుకున్న తాటికొండ రాజయ్య.. ఏమన్నారంటే..?

