ginger tea benefits
లైఫ్‌స్టైల్

Ginger Tea: అల్లం చాయ్ అల‌వాటు చేసుకోండి

Ginger Tea: సాధారణంగా అల్లాన్ని మనం కూరల్లో వాడుతుంటాం. టేస్ట్‌ కోసం టీలో కూడా వేసుకుంటాం. అయితే ఈ అల్లం టీ వల్ల ఆస్తమా కూడా నయం అవుతుందంటున్నారు నిపుణులు. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ సంవృద్ధిగా ఉన్నాయి. ప్రతిరోజు కప్పు అల్లం టీని తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆస్తమా, దగ్గుకు చెక్‌ పెట్టాలంటే మాత్రం రోజూ అల్లం టీని తేనెతో కలిపి తాగాలి. అల్లం టీతో రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఇందులోని ఖనిజ లవణాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

గుండెలోని కవాటాల్లో రక్త సరఫరా సక్రమంగా ఉండేందుకు ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాకుండా హృద్రోగాలు కూడా దరిచేరవు. ఈ అల్లం టీ వల్ల నెలసరి సమస్యలు తగ్గుతాయి. మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువశాతం అందుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉండే అరోమాలాంటి గుణాలు మన మెదడును ఉత్తేజ పరుస్తాయి. ఉదయాన్నే ఈ టీ తాగడం వల్ల రోజంతా చురుగ్గా ఉంచుతుంది. అంతేకాకుండా గర్భిణీలకు కూడా ఈ అల్లం టీ తాగడం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది.

Ginger Tea: వేవిళ్లు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మామూలు టీలో అల్లంరప్ప కలిపి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఛాతిలో మంట, అజీర్ణంలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అల్లం టీ తాగడం వల్ల మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు రావు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి ఉన్నవారు అల్లం టీ తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది.

అల్లం టీ ఎలా తయారు చేయాలి?

అల్లం టీ తయారు చేయడం చాలా సులభం.

ఒక కప్పు నీటిని మరిగించండి.

అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం వేయండి.

కొన్ని నిమిషాల పాటు మరిగించండి.

టీని వడకట్టి, కొంచెం తేనె లేదా నిమ్మరసం కలుపుకొని తాగండి.

గమనిక:

అల్లం టీ సాధారణంగా సురక్షితమైనది, కానీ కొంతమందికి ఇది కడుపులో మంటను కలిగిస్తుంది. అలాంటివారు వైద్య సలహా తీసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు మరియు కొన్ని రకాల మందులు తీసుకునేవారు అల్లం టీ తాగే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి.

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు