Telangana Rising 2047: వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ – 2026 (Davos Economic Forum – 2026) సమావేశాల్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను, అలాగే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు రూపొందించిన క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) ఫ్రేమ్ వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం చాటి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.
‘విజన్‌పై ప్రచారం చేయండి’
గత రెండేళ్లు దావోస్ పర్యటనల సందర్భంగా, ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 (Telangana Rising Global Summit) లో వచ్చిన పెట్టుబడులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, విజన్‌పై ఎక్కువగా పబ్లిసిటీ చేయాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పారు. ‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ అనే థీమ్‌తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాలు 2026 జనవరి 19 నుంచి 23 వరకు డావోస్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదిక తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.
దావోస్‌లో ప్రజెంటేషన్..
గతంలో వచ్చిన పెట్టుబడుల పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న అంశాలు లేదా అడ్డంకులను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన 3 దిశల ఆర్థిక వృద్ధి వ్యూహాన్ని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి రోడ్ మ్యాప్‌ను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో ప్రజెంటేషన్ చేయాలని స్పష్టం చేశారు.
Also Read: Telangana Govt: తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినెలా రూ.800 కోట్లు సేఫ్?.. ఎందుకంటే
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు ఏంటీ?
తెలంగాణ రైజింగ్ – 2047 అనే విజన్ డాక్యుమెంటరీని గతేడాది డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణను ప్రపంచస్థాయి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇందులో కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని విజన్ డాక్యుమెంట్ లో లక్ష్యంగా చేర్చారు. అలాగే రాష్ట్రంలో పేదలు, రైతులు, దళితులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్య సేవలు, ప్రతీ కుటుంబానికి ఆరోగ్య సేవలు విజన్ లో పొందుపరిచారు. అలాగే క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు రకాల ఆర్థిక కారిడార్లను సైతం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ లో ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.

