BMW Heroines: మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). డింపుల్ హయతి (Dimple Hayathi), ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో హీరోయిన్లు చాలా హుషారుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ముందుగా..
Also Read- Sanjay Dutt: మూడు రూ. 1000 కోట్ల చిత్రాలున్న ఏకైక ఇండియన్ యాక్టర్.. ‘రాజా సాబ్’ మిస్!
ప్రతి సినిమా డిఫరెంట్‌గా వుండేలా
హీరోయిన్ ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కిషోర్ తిరుమలతో దీనికంటే ముందే ఒక ప్రాజెక్ట్ చేయాలి. కొన్ని కారణాలతో ఇది కుదరలేదు. తర్వాత ఆయన ఈ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ చెప్పారు. కథ విన్నప్పుడే ఇందులో మోడ్రన్ గర్ల్ పాత్ర చేయాలని డిసైడయ్యాను. ఆయన కూడా అదే పాత్రకి అనుకున్నానని చెప్పారు. ‘నా సామిరంగ’ సినిమాతో పోల్చుకుంటే ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ క్యారెక్టర్. ఖచ్చితంగా నా కెరీర్‌లో చాలా కొత్తగా వుంటుందని చెప్పగలను. ఇందులో నా పాత్ర పేరు మానస శెట్టి. ఇప్పుడున్న అమ్మాయిలకు బాగా రిలేట్ అయ్యే పాత్ర. ఇందులో సత్య నా పీఏ పాత్రలో కనిపిస్తారు. అది చాలా మంచి నవ్వులు పంచే క్యారెక్టర్. రవితేజ, సునీల్, వెన్నెల కిషోర్, సత్య అందరూ కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ వున్న నటులు. వాళ్ళ టైమింగ్‌ని మ్యాచ్ చేయడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇక మాస్ రాజా ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. అందులోనూ నాకేమో తెలుగు అంతగా రాదు. ఈ విషయంలో డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారు. ఇందులో నా క్యారెక్టర్ చాలా అందంగా చూపించారు. రవితేజతో కలసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. నా ప్రతి సినిమా డిఫరెంట్‌గా వుండేలా చూసుకుంటున్నాను. ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్ 2’ చిత్రాలు చేస్తున్నానని తెలిపారు.
Also Read- BMW Pre Release Event: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడంటే?
వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్
డింపుల్ హయతి మాట్లాడుతూ.. డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. ఈ కథ వినగానే ఇందులో వైఫ్ క్యారెక్టర్ బాలామణి పాత్ర చేయాలని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే ఇంతకు ముందు రవితేజతో ఒక మోడరన్ అమ్మాయి పాత్ర చేశాను. బాలామణి పాత్ర అయితే నాకు కొత్తగా వుంటుందనిపించింది. డైరెక్టర్ కూడా ఆ పాత్ర కోసమే అనుకోవడం ఆనందంగా అనిపించింది. కథ మొత్తం చెప్పిన తర్వాత ఇందులో హీరో రవితేజ అని చెప్పడంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో నాకు ఇది రెండో సినిమా. ఇందులో నాది వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. డైరెక్టర్ నా పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బాలామణి పాత్రలో కనిపించడం నిజంగా నాకే కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ వుంది. అది అందరూ సినిమాలోనే చూడాలి. డైరెక్టర్ ప్రతిది నటించి చూపిస్తారు. ఆయన డైలాగ్స్ కూడా చాలా యునిక్‌గా వుంటాయి. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. కామెడీ చాలా సెన్సిబుల్‌గా ఉంటూ, అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మా ఇద్దరి (ఆషిక) పర్ఫార్మెన్స్ ఎనర్జిటిక్‌గా వుంటుంది. ఈ మూవీ జర్నీలో తను చాలా మంచి ఫ్రెండయ్యింది. మా మధ్య మంచి బాండింగ్ వుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లకు వచ్చి చూడండని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

