Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) తాజాగా నటుడు, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)ని సత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. హైపర్ ఆదిని పవన్ కళ్యాణ్ ఎందుకు సత్కరించారు? ఎక్కడ సత్కరించారు? అనే విషయాల్లోకి వస్తే.. శుక్రవారం ఉదయం పిఠాపురంలోని ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు జరగనున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను (Sankranthi Celebrations) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ‘‘పిఠాపురం (Pithapuram) చాలా కీలకమైన శక్తి పీఠం. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఇది. ఏ రోజు కూడా సినిమాల్లో నటించాలి, రాజకీయాల్లో పోటీ చేయాలని అనుకోలేదు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ భగవంతుడి సంకల్పం’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Also Read- BMW Pre Release Event: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడంటే?
జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు
ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన ప్రముఖులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. మంత్రు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, నారాయణలతో పాటు గెస్ట్‌లుగా హాజరైన హైపర్ ఆది, సాగర్‌లను కూడా ఆయన శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అంతే తప్ప, వేరే ఏదో విషయం ఏం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని హైపర్ ఆది ఎంతగా ఆరాధిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రీసెంట్‌గా గెస్ట్‌గా హాజరైన ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ కార్యక్రమంలో కూడా చాలా గొప్పగా చెప్పారు. ఈ షోలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘‘నా నాయకుడు అందరిలాగా జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు.. లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు. నా నాయకుడికి ధనం మీద వ్యామోహం లేదు. ఆస్తులు మీద వ్యామోహం లేదు.. నిజాయితీపరుడు’’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది.
Also Read- MSG Ticket Price: చిరు సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరల హైక్, ప్రీమియర్ వివరాలివే!
సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో, అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని, మన సనాతన ధర్మ మూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధనకు సంబంధించిన పండుగ అని అన్నారు. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, వైజ్ఞానికపరమైన అంశాలు ఈ వేడుకలో భాగమై ఉన్నాయని చెప్పారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. అప్యాయత, అనురాగాలకు నిలువటద్దాలు. వాటి మూలాలను, గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్పితే.. కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలను కాదని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

