Samantha Movie: ‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్..
ma-inti-bangaram
ఎంటర్‌టైన్‌మెంట్

Samantha Movie: సమంత ‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Samantha Movie: పెళ్లి తర్వాత సమంత రూత్ ప్రభు మరో ఫ్రెష్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన సొంత నిర్మాణంలో ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం అనే సినిమా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ విడుదలకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో టీజర్ ట్రైలర్ ను జనవరి 9, 2026 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సమంత కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె కేవలం నటిగానే కాకుండా, తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures) పతాకంపై స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Read also-Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?

ఈ సినిమా సమంత ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న రెండో ప్రాజెక్ట్. మొదటిది ‘శుభం’. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సమంత ఆర్టీసీ బస్సులో యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమంతతో పాటు ప్రముఖ దర్శకులు రాజ్ నిడిమోరు కూడా భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2026 చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సమంత నిర్మాణంలో వచ్చిన మొదటి సినిమా శుభం మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ అనుకుంటే ప్రేక్షకుల్లో కుతూహలం పెంచేందుకు టీజర్, ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. దీంతో ముందునుంచే ఎంతో స్ట్రేటజిక్ గా ముందుకు వెళుతుంది ఈ సినిమా. మరి ఈ టీజర్ ట్రైలర్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంత రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్న తర్వా రాబోతున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

Read also-Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?

Just In

01

The RajaSaab Review: రెబల్ సాబ్ ‘ది రాజాసాబ్’తో ఎంతవరకూ మెప్పించారు?.. ఫుల్ రివ్యూ..

Hyderabad Police: ఆహార కల్తీని హత్యాయత్నంగానే పరిగణిస్తాం.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..ఇంకో 8 ఏళ్లు మనదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy: వైఐఐఆర్‌సీ మొద‌టి విడుత‌లో బాలిక‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి!

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలే.. తెలంగాణకు శాపం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!