MSG Trailer: అనిల్ రావిపూడి గారూ.. బుల్లిరాజు ఎక్కడ?
MSG Bulli Raju (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

MSG Trailer: అనిల్ రావిపూడి గారూ.. బుల్లిరాజు ఎక్కడ?

MSG Trailer: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కాంబినేషన్‌లో హిట్ మెషిన్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). చిరంజీవి సరసన నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, ఆదివారం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం దూసుకెళుతోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 25 మిలియన్ల ప్లస్ వ్యూస్‌ని రాబట్టుకుని, టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది. దీంతో చిత్రయూనిట్ యమా హ్యాపీగా ఉన్నారు. అలాగే మెగాభిమానులు కూడా ఈ ట్రైలర్‌తో సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read- Koragajja: రీల్స్ కాంటెస్ట్.. ‘కొరగజ్జ’ రూ. కోటి ఆఫర్.. అసభ్యకరంగా చేశారో!

సందేహాలు మొదలు

అంతా బాగానే ఉంది కానీ, ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఒకటే సందేహం వ్యక్తమవుతోంది. అదేంటి అనుకుంటున్నారా? ట్రైలర్‌లో చిరంజీవి, నయనతారలను చూపించారు. విక్టరీ వెంకటేష్ అదిరిపోయే ఎంట్రీ కూడా ఉంది. ఇంకా ఇతర పాత్రలలో ఉన్న చాలా వరకు మెంబర్స్‌ని చూపించారు. కానీ అసలు సిసలైన వ్యక్తిని ఎందుకు చూపించలేదు? అసలతను ఈ సినిమాలో ఉన్నాడా? లేదా? అనేలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు.. మన బుల్లిరాజు. అవును, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 2025 సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్‌లో బుల్లిరాజు పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని కామెడీ, బూతులు కొత్తగా ఉండటంతో, జనాలు విరగబడి మరీ చూశారు, నవ్వుకున్నారు.

Also Read- Bhagavanth Kesari: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. బాలయ్య సినిమా కోసం ఓటీటీలో ఎగబడుతున్నారు

సినిమాలో బుల్లిరాజు లేడా?

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రమోషన్స్‌లో కూడా దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి బుల్లిరాజు (Bulli Raju) కనిపించారు. కానీ, ట్రైలర్‌లో మాత్రం బుల్లిరాజును ఎక్కడా చూపించలేదు. చిన్న సీన్‌లో కూడా అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవేళ అతను కనిపిస్తే, అటెన్షన్ మొత్తం అటు పోతుందని భావించారా? లేకపోతే అసలీ సినిమాలోనే బుల్లిరాజు లేడా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో అనిల్ రావిపూడి ప్లాన్ ఏంటి? బుల్లిరాజును పరిచయం చేస్తూ రిలీజ్‌కు ముందు ఏమైనా ప్రత్యేక గ్లింప్స్ వదులుతారా? ఏదిఏమైనా, ట్రైలర్ ఎంత బాగున్నా, బుల్లిరాజు ట్రైలర్‌లో కనిపించని లోటు మాత్రం నెటిజన్లకు బాగా ఉంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం జనవరి 7 వరకు వెయిట్ చేయాల్సిందే. అదేంటి, సినిమా విడుదల జనవరి 12 కదా, 7 అంటున్నారేంటి? అనుకుంటున్నారు కదా. జనవరి 7న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు చిరు, వెంకీ హాజరు కానున్నారని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిజంగా బుల్లిరాజు ఉంటే, ఈ వేడుకకు వస్తాడు, అతనితో ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు కాబట్టి.. ఆ వేదిక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Celebrity Controversy: మరోసారి వైరల్ అవుతున్న అనసూయ వీడియో.. శివాజీని ఏం అన్నారంటే?

Hyderabad Crime: తరుచూ ఫోన్‌ మాట్లాడటంపై.. ప్రశ్నించిన లవర్.. సూసైడ్ చేసుకున్న ప్రేయసి

Municipal Elections: ఆ తేది కల్లా ఓటరు తుది జాబితా సిద్ధం చేయాలి.. అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్!

The RajaSaab: మీడియా దెబ్బకు భయపడే స్టేజుకు వెళ్లిపోయా.. ‘ది రాజాసాబ్’ దర్శకుడు

Harish Rao: యూనివర్సిటీలపై ఎందుకంత కక్ష? కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం : హరీశ్ రావు కామెంట్స్!