Koragajja: రీల్స్ కాంటెస్ట్.. ‘కొరగజ్జ’ రూ. కోటి ఆఫర్.. ఇవే డిటైల్స్
Koragajja Movie (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Koragajja: రీల్స్ కాంటెస్ట్.. ‘కొరగజ్జ’ రూ. కోటి ఆఫర్.. అసభ్యకరంగా చేశారో!

Koragajja: సుధీర్ అట్టావర్ (Sudheer Attavar) దర్శకత్వంలోని రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కొరగజ్జ’ (Koragajja). ఇప్పుడీ సినిమా ఓ కాంటెస్ట్‌తో ప్రేక్షకులలో హైప్‌ని క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. ‘కొరగజ్జ’ చిత్ర ఆడియో ప్రీమియర్ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. హోటల్ హాలిడే ఇన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం బిగ్ ఎఫ్‌ఎమ్ 92.7 ద్వారా లైవ్ ప్రసారం కాగా, సినిమా పాటలు 300కి పైగా ఆడియో ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యాయి. ఈ వేడుకకు భారతదేశపు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన తొలి పాప్ సింగర్, నటుడు షారన్ ప్రభాకర్‌తో పాటు సీనియర్ నటుడు భవ్య, దర్శకుడు నాగతిహళ్లి చంద్రశేఖర్, నిర్మాత త్రివిక్రమ సపల్య (Thrivikrama Sapalya), జాతీయ అవార్డు గ్రహీత, ఎడిటర్ విద్యాధర్ శెట్టి, బిగ్ ఎఫ్‌ఎఫ్ సౌత్ హెడ్ విశ్వాస్ తదితరలు హాజరయ్యారు. ఆర్జేలు విక్కీ, దుష్యంత్, ప్రదీప్ తమ ఎనర్జీతో ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా టీమ్‌తో రేడియో నెట్‌వర్క్ మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని విశ్వాస్ ప్రశంసించారు.

Also Read- Lenin Movie: అరె విన్నావా విన్నావా.. ‘లెనిన్’ పాట వచ్చిందిన్నావా.. వ్వా వవ్వారె వారెవా!

హైలెట్స్ ఇవే..

ఈ కార్యక్రమంలో శ్రేయ ఘోషల్, అర్మాన్ మాలిక్ ఆలపించిన ఏఐ పవర్డ్ ట్రాక్ ‘గాలి గంధ’ ప్రపంచస్థాయి సౌండ్ డిజైన్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఆర్జే ప్రదీప్, దర్శకుడు సుధీర్ అట్టావర్ యాంకరింగ్ చేయడం విశేషం. నిర్మాత త్రివిక్రమ సపల్య, ఈపీ విద్యాధర్ శెట్టి అతిథులను ఘనంగా సత్కరించారు. ‘మహిషాసుర’ యక్షగాన దృశ్యంలో మహిషాసురుని తల్లి మాలిని పాత్రలో భవ్య చేసిన ప్రదర్శన ఈ కార్యక్రమంలో హైలెట్‌గా నిలిచింది. ఆమె యక్షగానం స్నిపెట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నేపథ్య గాయకులు రమేశ్‌చంద్ర, ప్రతిమ భట్‌తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా పాటలు, నృత్యాల్లో పాల్గొన్నారు.

Also Read- Bhagavanth Kesari: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. బాలయ్య సినిమా కోసం ఓటీటీలో ఎగబడుతున్నారు

రీల్స్‌కు రూ. కోటి ఆఫర్

ఈ సందర్భంగా ఈ న్యూ ఇయర్‌లో ‘కొరగజ్జ’ పాటలతో క్రియేటివ్ రీల్స్ చేసి భారీ బహుమతులు పొందేలా కాంటెస్ట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పాటలతో క్రియేటివ్ రీల్స్ రూపొందించాలని, ఆ రీల్స్‌ కనుక ఎక్కువ వ్యూస్, లైక్స్, కామెంట్స్ పొందితే.. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కలిపి మొత్తం రూ. 1 కోటి విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని మేకర్స్ వెల్లడించారు. ప్రతి వారం జిల్లా స్థాయిలో ప్రత్యేక గిఫ్ట్స్ ఉంటాయని కూడా తెలిపారు. ఈ రీల్స్ విషయంలో ఓ కండీషన్ కూడా పెట్టారండోయ్.. అదేంటంటే, అసభ్యకరమైన లేదా ఎగతాళి చేసే వీడియోలు పోస్ట్ చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీల్స్ చేసిన అనంతరం దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ అకౌంట్స్‌కు ట్యాగ్ చేయాలని కోరారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అట్టావర్ దర్శకత్వంలో, త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. కబీర్ బేడి, ప్రముఖ కొరియోగ్రాఫర్లు సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య.. దక్షిణాది టాప్ నటులు భవ్య, శృతి సహా మరెందరో ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. విద్యాధర్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Hyderabad Crime: తరుచూ ఫోన్‌ మాట్లాడటంపై.. ప్రశ్నించిన లవర్.. సూసైడ్ చేసుకున్న ప్రేయసి

Municipal Elections: ఆ తేది కల్లా ఓటరు తుది జాబితా సిద్ధం చేయాలి.. అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్!

The RajaSaab: మీడియా దెబ్బకు భయపడే స్టేజుకు వెళ్లిపోయా.. ‘ది రాజాసాబ్’ దర్శకుడు

Harish Rao: యూనివర్సిటీలపై ఎందుకంత కక్ష? కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం : హరీశ్ రావు కామెంట్స్!

Prabhas Interview: సందీప్ రెడ్డితో ప్రభాస్ కింగ్ సైజ్ ఇంటర్వ్యూ.. ఫుల్ వీడియో వచ్చేసింది..