Purushaha: రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు.. రిజల్ట్ చూశారా!
Purushaha Movie (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Purushaha: రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు.. రిజల్ట్ చూశారా!

Purushaha: ఈ మధ్యకాలంలో కేవలం పోస్టర్స్‌తోనే హైప్ క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా ‘పురుష:’ (Purushaha) మూవీనే అని చెప్పుకోవాలి. భార్యాభర్తల తగాదాలను ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చూపించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి ఫ్యామిలీ కథతో వచ్చే కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌గా నిలుస్తుంటాయి. అలాంటి కథతోనే ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ బత్తుల (Pavan Kalyan Battula) హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకర్షించి, సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. మామూలుగా అయితే ఏ సినిమా నుంచైనా టీజర్, ట్రైలర్‌ వంటివి వచ్చిన తర్వాత హైప్ క్రియేట్ అవుతుంది. కానీ, కేవలం పోస్టర్స్‌తోనే సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా మరో పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

విషిక పాత్ర లుక్ విడుదల

ఇప్పటి వరకు హీరోహీరోయిన్ల పాత్రలు, వారి పాత్రల స్వభావాన్ని తెలియజేసేలా పోస్టర్లను విడుదల చేస్తూ అందరిలోనూ ఆసక్తిని పెంచారు. హీరోయిన్ వైష్ణవి పాత్రని ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అని, ‘పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ’ అనే క్యాప్షన్‌తో హాసిని పాత్రని పరిచయం చేశారు. ఇక ఆమె పాత్ర పూర్తి రెబల్‌గా ఉంటుందనేది పోస్టర్‌తో అర్థమైంది. తాజాగా విషిక పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వైష్ణవి, హాసిని కంటే విషిక పాత్ర మరింత ఆసక్తికరంగా ఉంటుందనే విషయం ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో విషిక (Vishika) చేతిలో కసిరెడ్డి రాజ్ కుమార్‌ (Rajkumar Kasireddy) ఎంతగా నలిగిపోతున్నాడనే విషయాన్ని చాలా చక్కగా డిజైన్ చేసి చూపించారు.

Also Read- Poonam Kaur: అశ్లీల వీడియోలు రిలీజ్ చేస్తామని.. పూనమ్‌ని బెదిరించిన కడప వ్యక్తులెవరు?

దమ్ముంటే టచ్ చేసి చూడు

ఈ పోస్టర్‌పై ‘అతను రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు.. దాని ఫలితం ఇదే’ అని ఇంగ్లీష్ లెటర్స్‌లో రాసి ఉండగా.. విషిక తన కాలితో కసిరెడ్డిని తన్నినట్లుగా చూపించారు. ఆమె కాలితో తంతే.. గాల్లోకి ఎగిరాడు అన్నట్టుగా విషిక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ‘దమ్ముంటే టచ్ చేసి చూడు’ అని టీ షర్ట్ మీద కనిపిస్తున్న క్యాప్షన్ చూస్తుంటే విషిక ఈ మూవీలో రఫ్ఫాడిస్తుందనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ కూడా వైరల్ అవుతూ.. సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడేలా చేస్తుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, VTV గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ అన్నింటినీ ఎంతగానో ఆదరించారు. తాజాగా విషిక పాత్రను పరిచయం చేశాం. ఈ పోస్టర్‌కు కూడా మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!