Uttam Kumar Reddy: నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసమే పీఆర్‌ఎల్‌ఐసీ నీటి సామర్థ్యాన్ని టీఎంసీకి కుదించారన్నారు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అలయ్ బలయ్ చేసుకుని తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రజా భవన్‌లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా జలాశయాలలో 763 టీఎంసీల తెలంగాణకు కేటాయించాల్సిందే అని అభిప్రాయపడ్డారు. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుండి శ్రీశైలం ఎందుకు మార్చారు. పీఆర్‌ఎల్ఐసీ 90% పూర్తి అయిందనడం వాస్తవం కాదు. ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటే రూ.80 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. 2015లో ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.35 వేల కోట్లతో అంచనా వేశారు’ అని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు.
Also Read: Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ ఆరోపణలు అర్థరహితం
కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురైందని, నదీ జలాల అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2022లో సీడబ్ల్యూసీకి ఇచ్చిన డీపీఆర్‌లో భూసేకరణ, కాలువల నిర్మాణం లేకుండానే రూ.55 వేల కోట్లకు పెంచారన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పీఆర్‌ఎల్‌ఐసీ మీద పెట్టిన ఖర్చు రూ.27 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిదని వివరించారు. జూరాల వద్దే కొనసాగితే ఇంత వ్యయం ఉండదని, 90 టీఎంసీల నీటితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తికి కట్టుబడి ఉన్నామన్నారు. జలాశయాలలో తెలంగాణ వాటా పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందన్నారు. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్‌లో వాదనలు గట్టిగా విపిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
Also Read: Uttam Kumar Reddy: ఇరిగేషన్ ప్రాజెక్టులను నాశనం చేసిందే కేసీఆర్: మంత్రి ఉత్తమ్ ఫైర్..!

