COLDWAVE 2.0: కాచుకోండి మళ్లీ చలి పులి పంజా విసరబోతోంది
Cold Wave-Telangana (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

COLDWAVE 2.0: కాచుకోండి మళ్లీ చలి పులి పంజా విసరబోతోంది.. ఎప్పటినుంచంటే?

COLDWAVE 2.0: జనవరి 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో చలి కాస్తంత తగ్గింది. జనాలు రిలీఫ్ అవుతుండగా, మరోసారి చలి పులి పంజా విసిరేందుకు తయారైంది. కోల్డ్ వేవ్ 2.O షురూ (COLDWAVE 2.0) కాబోతోంది. జనవరి 5 నుంచి తిరిగి మళ్లీ విపరీతమైన చలి పెడుతుందని వాతావరణ అప్‌డేట్స్ అందించే పాపులర్ ట్విటర్ పేజీ ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ అప్రమత్తం చేసింది. శీతల గాలుల వీస్తాయని తెలిపింది. జనవరి 5 నుంచి 12 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తగ్గుతాయని, 25 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలిపింది. ఇక, పగటిపూట మసకగా ఉంటుందని, మంచు వాతావరణం కొనసాగుతుందని వివరించింది. మొత్తంగా గత నెల జనవరిలో ఉన్న వాతావరణం తిరగి వారం రోజులపాటు ఉంటుందని హెచ్చరించింది.

కాగా, ఈ తరహా శీతల గాలులు, చల్లటి వాతావరణంలో వృద్ధులు, చిన్న పిల్లలు, శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. కాబట్టి, బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్లు ధరించడం మంచిది. అలాగే, విజిబిలిటీ తక్కువగా ఉండే ఉదయం వేళలు, రాత్రి పూటల్లో ప్రయాణాలు చేయకపోవడం మంచిదని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు.

Read Also- Srinivas Goud: చట్టసభల్లో మహిళాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఉత్తర భారతంలో వణుకుపట్టే చలి

ఉత్తర భారతదేశంలో కూడా కోల్డ్ వేవ్ కొనసాగనుందని భారత వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన చలి ఉంటుందని తెలిపింది. ఇక, వాయువ్య భారతంలో చలి తీవ్రత పెరగడంతో ‘యెల్లో అలర్ట్’‌ను జారీ చేసింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా రాష్ట్రాల్లో జనవరి 4 నుంచి జనవరి 6 వరకు శీతల గాలులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. శీతల గాలులు, మంచు ప్రభావంతో ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత (AQI) కూడా ఆందోళనకరంగా మారింది. ఆదివారం నాడు ఢిల్లీ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 248గా నమోదయింది. అంటే, గాలి నాణ్యత చాలా పేలవంగా ఉందని దీనిర్థం. ఈ ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో ఉత్తర భారతదేశంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విమాన ప్రయాణాల్లో కూడా అవాంతరాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కూడా ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది.

Read Also- Narsa Reddy Slams KCR: గజ్వేల్ పెండింగ్ పనుల పూర్తి బాధ్యత కేసిఆర్‌దే.. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సంచలన ఆరోపణలు!

Just In

01

GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్‌లో రూ.2,260 కోట్ల కేటాయింపు!

Vedire Sriram: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో ఏపీకి నీటిని తరలించింది.. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు!

Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?

Big Academy – Yuvraj Singh: వైఫల్యం చెందకపోతే ఎలా గెలవాలో తెలియదు.. బిగ్ అకాడమీ లాంఛింగ్‌లో యువరాజ్ సందేశం

HYD Water Supply: బీ అలర్ట్.. 8, 9 తేదీల్లో ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం