వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్రెడిబిలిటీ ఉండాలంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ కి విజయసాయిరెడ్డి కూడా గట్టిగానే బదులిచ్చారు. ఎక్స్ వేదికగా జగన్ వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు.
“వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా” అని విజయ్ సాయి ట్వీట్ చేశారు.
Also Read : చాయ్‌తో పాటు తినాల్సిన స్నాక్స్ ఏంటి?
కాగా, వైఎస్ జగన్ (YS Jagan) గురువారం మీడియాతో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజకీయాలని వదిలిపెట్టడంపై స్పందన అడగగా… జగన్ కొంచెం ఘాటుగానే స్పందించారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ క్రెడిబిలిటీతో ఉండాలన్నారు. వీడు మా నాయకుడు అని కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా విలువలతో రాజకీయం చేయాలని హితబోధ చేశారు. ప్రలోభాలకు లొంగి, భయపడి… ఏదొక కారణం చేత కాంప్రమైజ్ అయిపోయి, ఎటువైపుకి పోతే మన వాల్యూ, గౌరవం, క్రెడిబులిటీ ఏముంటుంది అని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు ముగ్గురు ఎంపీలు పోయారు, విజయసాయిరెడ్డితో కలిపి నలుగురు అవుతారు. ఇంకెవరు పోయినా వైసీపీకి ఏం జరగదు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై నేడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చారు.