Xiaomi Mix 5: Xiaomi తన కొత్త Mix లైనప్‌ను మరోసారి తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. బయటకు వచ్చిన లీక్‌ల ప్రకారం, కంపెనీ Xiaomi Mix 5 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ లవర్స్ ముందుకు తీసుకురానుంది. Mix సిరీస్‌లో తర్వాత వచ్చే మోడల్‌గా ఉంటుంది. ఇక్కడ ఇంకో షాకింగ్ గా విషయం ఏంటంటే.. ఈ కొత్త ఫోన్ Apple iPhone 18 సిరీస్ కంటే కొంచం ముందుగానే లాంచ్ అవుతుందని చర్చలు వస్తున్నాయి.
Xiaomi ఎప్పటినుంచో కొత్త ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా, పూర్తిగా ఫ్రంట్ డిస్‌ప్లేను మొత్తం మార్చడం.. ఇంకా స్మార్ట్‌ఫోన్‌లకు చేరని కొత్త ఫీచర్ల తేవడం పై కంపెనీ దృష్టి పెట్టింది.
ఫ్రంట్ డిస్‌ప్లే దిశగా Xiaomi Mix 5 కీలక అడుగు?
ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేసిన సమాచారం ప్రకారం, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, అండర్-డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాతో మన ముందుకు రానుంది. అదే పోస్ట్‌లో Xiaomi Mix నంబర్ సిరీస్ తిరిగి మీ ముందుకు తీసుకువస్తుంది కదా.. అయితే, ఎంత మంది యూజర్లు ఎదురుచూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీంతో, ఈ సంకేతాలు Xiaomi Mix 5 వైపే చూపుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదిలా ఉండగా, మరో టిప్‌స్టర్ లీక్ ప్రకారం, Mix 5లో అండర్-డిస్‌ప్లే 3D ఫేస్ కు సపోర్ట్ ఇస్తుందని చెబుతున్నారు. ఈ ఫీచర్ వాణిజ్య పరంగా మారితే, అండర్-డిస్‌ప్లే 3D ఫేస్ ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన మొదటి కంపెనీగా Xiaomi నిలబడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, మరో టిప్‌స్టర్ లీక్ ప్రకారం, Mix 5లో అండర్-డిస్‌ప్లే 3D ఫేస్ కు సపోర్ట్ ఇస్తుందని చెబుతున్నారు. ఈ ఫీచర్ వాణిజ్య పరంగా మారితే, అండర్-డిస్‌ప్లే 3D ఫేస్ ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన మొదటి కంపెనీగా Xiaomi నిలబడే అవకాశం ఉంది.
Also Read: Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Lei Jun కీనోట్‌లో లాంచ్ అయ్యే అవకాశం
Xiaomi Mix 5ను కంపెనీ CEO Lei Jun నిర్వహించే కీనోట్ ప్రోగ్రామ్ లో లాంచ్ చేయొచ్చని రూమర్స్ వస్తున్నాయి. నార్మల్ గా ఈ వేదికను Xiaomi అత్యంత కీలకమైన ఉత్పత్తుల లాంచ్‌లకు మాత్రమే ఉపయోగిస్తుంది. అలా జరిగితే, Xiaomi ఉత్పత్తి వ్యూహంలో Mix 5కి ఉన్న ప్రాధాన్యత స్పష్టమవుతుంది.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. Xiaomi చివరిసారిగా ఆగస్టు 2021లో Xiaomi Mix 4తో Mix సిరీస్‌ను విడుదల చేసింది. ఆ మోడల్ కంపెనీ తొలి అండర్-డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఫోన్‌గా నిలిచింది. సిరామిక్ యూనిబాడీ డిజైన్, Snapdragon 888+ ప్రాసెసర్, 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 20MP దాచిన సెల్ఫీ కెమెరా వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. అయితే, అప్పటి అండర్-డిస్‌ప్లే టెక్నాలజీ పరిమితుల కారణంగా సెల్ఫీ కెమెరా అయితే ఉహించిని విధంగా అయితే లేదు.

