Pawan Impact: టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ రేంజ్ ఎలాంటిదో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పవన్ ఫ్లాప్ సినిమా మీడియం రేంజ్ హీరో హిట్ సినిమాతో సమానంగా కలెక్షన్లు వస్తాయి. అందుకు నిదర్శనంగా ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’ నిలుస్తోంది. ఆ సినిమా మొదటి రోజే దాదాపు వంద కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమా డివైన్ టాక్ తో తర్వాత రోజుల్లో అనుకున్నంత కలెక్షన్లు రాలేదు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగక పోవడంతో ఇక అవకాశాలు రావని అందరూ అనుకున్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ‘ది రాజాసాబ్’ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న నిధి అగర్వాల్ ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడారు. ‘ది రాజాసాబ్’ ప్రమోషన్ లో భాగంగా.. హరి హర వీరమల్లు సినిమా మీ మీద ఏమైనా ప్రభావం చూపిందా? అని యాంకర్ అడగ్గా.. అలాంటిది ఏమీ లేదు నిజంగా చెప్తేన్నా ఆ సినిమా తర్వాత నేను మూడు సినిమాలకు సైన్ చేశాను అవన్నీ ది రాజాసాబ్ తర్వాత బయటకు వస్తాయి. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఒక ఫ్లాప్ సినిమా కూడా ఇంత ఇంపేక్ట్ చూపిస్తుంది అంటూ ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.
Read also-Anvesh Case: అన్వేష్ కోసం పోలీసుల అన్వేషణ.. వివరాలు కావాలంటూ ఇన్‌స్టాకు లేఖ..
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభంమైనా అనివార్య కారణాల వల్ల జ్యోతి కృష్ణ పూర్తి చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ సనసన నిధి అగర్వాల్ కథా నాయికగా నటించారు. బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో ప్రతి నాయకుడిగా మెప్పించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు, ఏఎమ్ రత్నం కలిసి నిర్మించారు. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. మొఘలుల కాలంలో సాగే ఈ కథలో, ఒక అపురూపమైన వజ్రాన్ని (బహుశా కోహినూర్ వజ్రం) మొఘల్ కోట నుండి దొంగిలించడానికి వీర మల్లు చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. అన్యాయాన్ని ఎదిరించే ఒక వీరుడి ప్రయాణాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇది 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. పవన్ కళ్యాణ్ ఇందులో ఒక సాహసోపేతమైన బందిపోటు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావాల్సి ఉన్నా మొదటి భాగం నిరాశ పర్చడంతో రెండో భాగం తీయడానికి నిర్మాతల ఆసక్తి చూపడం లేదు. ఈ సినిమాను సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కానీ దాదాపు 110 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది.
Read also-Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ లాంచ్ అప్పుడేనా!.. ఎక్కడంటే?

