Mana Doctor Babe: గోదావరి నేపధ్యంలో రూపొందిన సినిమాలు దాదాపు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలాగా ఉంటాయి. అలాంటిదే మరో సినిమా కూడా రాబోతుంది. స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద శరణ్య, సుదీక్ష సమర్ఫణలో కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. శ్రీ స్కంద హీరోగా ఈ మూవీని చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా, హీరో పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. స్పెషల్ పోస్టర్‌తో పాటుగా, గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు.
Read also-Anvesh Case: అన్వేష్ కోసం పోలీసుల అన్వేషణ.. వివరాలు కావాలంటూ ఇన్‌స్టాకు లేఖ..
హీరో శ్రీ స్కంద పుట్టిన రోజు సందర్భంగా న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్‌ని చూస్తుంటే మాత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది. చుట్టూ పచ్చదనం, ఆ ఊరి వాతావరణం, ఆ ఊరిలోని క్లినిక్.. అక్కడ పని చేసే డాక్టర్.. అని ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఇక సినిమాలో కావాల్సినంత వినోదం ఉంటుందని ఈ గ్లింప్స్‌తోనే చెప్పేశారు. ‘మన డాక్టర్ బాబే’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా చిత్రం ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా అల్లరి నరేష్ బెండు అప్పారావు ఆర్ఎంపీ సినిమాలాగా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో మంచి వ్యూస్ సాధించాయి.
Read also-Star Heroines: ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆశలన్నీ ఆ తమిళ సినిమాలపైనే!
టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా మంచి బలం కలిగి ఉంది. ఈ చిత్రానికి మనోజ్ కుమార్ బుసం సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా కిషోర్ బోయిడాపు, ఎడిటర్‌గా సెల్వ కుమార్ పని చేస్తున్నారు. ఇక రాంబాబు గోసాల, గిరిధర్ రాగోలు, విష్ణు యర్రావుల తదితరులు ఈ చిత్రంలోని పాటలకి సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసుకుని ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు. శ్రీ స్కంద, మోహన సిద్ధి, శృతి శంకర్, రాజీవ్ కనకాల, అలీ, శాంతి శ్రీనివాస్, కోటేశ్వరరావు, శ్రీనివాస్ పేరురెడ్డి, శివకుమార్ మట్టా, కంచి ఎలమంచిలి తదితరులు ప్రధాన తారాగణం. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.

