Tobacco Tax: సిగరెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొత్త ధరలు!
Tobacco Tax (imagecredit:twitter)
Telangana News, జాతీయం

Tobacco Tax: సిగరెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు

Tobacco Tax: కొత్త ఏడాది మొదటి రోజే సిగరెట్ ప్రియులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలపై పన్నుల విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త పన్నులు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్టీ పరిహార సెస్‌కు బదులుగా ఈ కొత్త ఎక్సైజ్, ఆరోగ్య సెస్‌లు వర్తించనున్నాయి. ఈ నిర్ణయం ఇప్పటికే పొగాకు రంగంలోని స్టాక్స్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. ప్రతి వెయ్యి సిగరెట్ స్టిక్స్‌పై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు సుంకం విధించనున్నారు. ప్రస్తుతం ఉన్న 40 శాతం జీఎస్టీకి అదనంగా సుంకం ఉండనున్నది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 75 శతం పన్ను లక్ష్యం కంటే సుంకాలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. తాజా మార్పుల నేపథ్యంలో ఒక్కో సిగరెట్ రూ.48 అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Also Read: Micro Dramas: న్యూయర్‌లో కొత్త దర్శకులను అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?

స్టాక్ మార్కెట్ల ప్రభావం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఐటీసీ, గాడ్‌ఫ్రే కంపెనీల షేర్లపై ప్రభావం చూపింది. ఐటీసీ షేర్ సుమారు 6 శాతం మేర నష్టపోయి రూ.379 దగ్గర 52 వారాల కనిష్ట స్థాయికి చేరింది. అలాగే, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 10 శాతం మేర పతనం అయి రూ.2,483 దగ్గర ట్రేడ్ అయ్యాయి.

Also Read: Honey Glimpse: భయపెడుతోన్న నవీన్ చంద్ర.. ‘హనీ’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

Just In

01

BSNL WiFi Calling: మెరుగైన కనెక్టివిటీ కోసం దేశమంతటా BSNL Wi-Fi కాలింగ్ లాంచ్

Harish Rao on CM Revanth: మూసి కంపు కంటే.. సీఎం నోటి కంపే ఎక్కువ.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్

Drive OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ఆది పినిశెట్టి ‘డ్రైవ్’..

Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Rohini Statement: మహిళలకే నిబంధనలా? మగవారికి పద్ధతులు ఉండవా?.. నటి రోహిణి చురకలు