Hey Bhagawan: టాలీవుడ్లో మినిమం గ్యారెంటీ హీరో ఎవరు అంటే ఈ మధ్య అందరూ చెబుతున్న పేరు సుహాస్. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అన్నది పక్కన పెడితే, కథలో కంటెంట్ ఉంటే చాలు సుహాస్ దానిని తన భుజాల మీద మోసి హిట్టు కొట్టేస్తున్నాడు. ‘కలర్ ఫోటో’ నుంచి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ వరకు తనదైన నటనతో మెప్పించిన సుహాస్, ఇప్పుడు ‘హే భగవాన్’ (Hey Bhagwan) అంటూ మరో యూనిక్ స్క్రిప్ట్‌తో మన ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Also Read- Dharmasthala Niyojakavargam: బైక్ ఎక్కి, భయానకంగా ‘ధర్మస్థల నియోజవర్గం’ ఫస్ట్ లుక్
‘రైటర్ పద్మభూషణ్’ టచ్‌తో
ఈ సినిమాకు ఉన్న మెయిన్ హైలైట్లలో ఒకటి దీని కథ. ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సెన్సిబుల్ హిట్ ఇచ్చిన రచయిత షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందించారు. నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్లో కామెడీతో పాటు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండటంతో ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీ నెలకొంది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలో ట్విస్ట్‌లు ఉంటాయని చిత్రయూనిట్ హింట్ ఇస్తోంది.
Also Read- Micro Dramas: న్యూయర్‌లో కొత్త దర్శకులను అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
నూతన సంవత్సరం స్పెషల్‌గా వీడియో
షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం నూతన సంవత్సరం కానుకగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సెట్స్‌లో టీమ్ అంతా ఎంత సరదాగా పనిచేశారో, సుహాస్ తన టైమింగ్‌తో ఎలా అలరించారో ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూస్తే నవ్వు ఆగదు అంటే అతిశయోక్తి కానే కాదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుహాస్ సరసన ఈ సినిమాలో శివాని నగరం హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు డాక్టర్ నరేష్ వీకే, వెన్నెల కిషోర్, సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని 2026 లోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సుహాస్ నుంచి మరో క్రేజీ హిట్ వస్తుందని.. ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హారర్, యాక్షన్ సినిమాల మధ్య సైకలాజికల్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

