New District: మరో కొత్త జిల్లాకు ప్రభుత్వం శ్రీకారం!.. ఎక్కడంటే?
New-District (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

New District: మరో కొత్త జిల్లాకు ప్రభుత్వం శ్రీకారం!.. ఎక్కడంటే?

New District: కమిషనరేట్లకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటు

శాఖల సమన్వయం కోసమే ప్రతిపాదనలు
హైదరాబాద్​, మల్కాజిగిరి జిల్లాల హద్దులపై అధికారుల దృష్టి
అబ్ధుల్లాపూర్​మెట్టు మండలంపై ఆయోమయం!

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రజల పరిపాలన సౌలభ్య కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. గత ప్రభుత్వంలో ఏర్పాటైన పోలీస్​ కమిషనరేట్లను ఇప్పటికే ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ప్రజలకు పౌర సేవల అర్థమయ్యే విధంగా విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రజలకు అవసరంలేని పద్దతిలో పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మండలాల స్థాయితో పాటు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వా ఆలోచిస్తోంది. అయితే, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలో ఉన్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పూర్తిగా గ్రేటర్​ పరిధిలో విలీనం చేశారు. దీంతో, గ్రేటర్​ పరిధి ఔటర్​ రింగు రోడ్డు వరకు విస్తరించారు. అంతటితో ఆగకుండా నిఘా వ్యవస్థను సైతం ప్రక్షాళన చేశారు. హైదరాబాద్​ సిటీ​, సైబరాబాద్​, మల్కాజిగిరి, ఫ్యూచర్​ సిటీ కమిషనరేట్లుగా ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనరేట్‌గా కొనసాగిన ప్రాంతంలో మల్కాజిగిరి కమిషనరేట్​, యాదాద్రి భువనగిరి జిల్లాను ఎస్పీగా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, నూతనంగా ఏర్పాటైన కమిషనరేట్లకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు (New District) చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also- Rythu Bharosa Payment: సంక్రాంతికి రైతు భరోసా నగదు జమవుతుందా?.. తాజా పరిస్థితి ఏంటంటే?

కొత్త జిల్లా ఏర్పాటు ఇందులోనే…

ప్రస్తుతం కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు సైబరాబాద, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోకి పోలీస్ వ్యవస్థ విస్తరించింది. రాజేంద్రనగర్​, శంషాబాద్​, మండలాలతో పాటు బాలాపూర్ మండలంలోని కొంత పార్ట్​, ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల, మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ ప్రాంతాలు హైదరాబాద్​ సిటీలో… అబ్ధుల్లాపూర్​ మెట్టు మండలంలోని తోర్రూర్, కుంట్లూర్​, తుర్కయాంజల్, ఎల్బీనగర్​ నియోజకవర్గం మల్కాజిగిరిలో… కూకట్‌పల్లి, కుత్బాల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు పూర్తిగా సైబరాబాద్​ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఈ పోలీసు కమిషనరేట్లకు అనుగుణంగా జిల్లాలు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది.

హైదరాబాద్​ సిటీ కమిషనరేట్ పరిధిలో 150 డివిజన్లు, మల్కాజిగిరి పరిధిలో 76 డివిజన్లు,సైబరాబాద్​ పరిధిలో 74 డివిజన్ల చొప్పున నూతనంగా కార్పోరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే పద్దతుల్లో నూతనంగా జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ప్రచారం సాగుతుంది. ఫ్యూచర్​ సిటీ కమిషనరేట్​ పరిధికే ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిమిత కానున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రెవెన్యూ పరిధిలోని ప్రాంతాలు సైబరాబాద్, హైదరాబాద్ సిటీ, మల్కాజిగిరి ప్రాంతాల్లో విలీనం చేసి మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో హైదరాబాద్ సిటీ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో మల్కాజిగిరి కమిషనరేట్లు ఉండనున్నాయి. మరో కొత్త జిల్లాగా సైబరాబాద్​ కమిషనరేట్ ఆఫ్​ పోలీస పరిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిషనరేట్ల పరిధిలకు అనుగుణంగా అధికారులు హద్దులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.

Read Also- Harish Rao: జర్నలిస్టులను విడదీసే.. రెండు కార్డుల విధానం సరికాదు.. హరీష్ రావు ఆగ్రహం

అబ్ధుల్లాపూర్ మెట్టు మండలం పై తర్జనా భర్జన…

రంగారెడ్డి జిల్లాలో ఏరివేసినట్లుగా ఉండే రూరల్​ మండలం అబ్ధుల్లాపూర్ మెట్టు. ఈ మండలంలోని పోలీస్​ స్టేషన్​ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్​ పరిధిలోకి తీసుకొచ్చారు. కానీ ఈ మండలం హయత్​‌నగర్ ప్రాంతానికి అందుబాటులో ఉండనుంది. జాతీయ రహదారి విజయవాడకు వెళ్లే మార్గంలో అబ్ధుల్లాపూర్​ మెట్టు మండలం ఉండనుంది. ఈ మండలం ఏ జిల్లా పరిధలోకి తీసుకోవాలనే ఆలోచనపై రాష్ట్ర ప్రభుత్ం తర్జన భర్ఝన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అబ్ధుల్లాపూర్ మెట్టు మండలం పరిధిలోని పెద్ద అంబర్ పేట్, తుర్కయంజాల్​ మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్​లో విలీనంలో చేశారు.ఈ మున్సిపాలిటీలు మల్కాజిగిరి కమిషనరేట్ ఆఫ్ పోలీసు పరిధిలోకి వచ్చాయి. ఇలాంటప్పుడు ఈ మండలం మొత్తం మల్కాజిగిరిలో చేర్చాలా.. లేకపోతే కేవలం మున్సిపాలిటీలనే చేర్చి.. అబ్ధల్లాపూర్​ మెట్టు మండలంలోని రూరల్ రంగారెడ్డి జిల్లాలో ఉంచుతారా అనే విషయంపై సస్పెన్షన్​ కొనసాగుతుంది.

Just In

01

Star Heroines: ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆశలన్నీ ఆ తమిళ సినిమాలపైనే!

Ustaad Bhagat Singh: మామా మరో పోస్టర్ వదిలారు.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Hey Bhagawan: ‘హే భగవాన్’ స్పెషల్ వీడియో చూశారా.. నవ్వకుండా ఉండలేరు!

Govt Employees: ఉద్యోగ సంఘాలకు కొత్త ఏడాది గుడ్ న్యూస్!.. సీఎం రేవంత్ కీలక సందేశం?

Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి