Rythu Bharosa Payment: సంక్రాంతికి రైతు భరోసా నగదు జమ?
Rythu-Bharosa (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Rythu Bharosa Payment: సంక్రాంతికి రైతు భరోసా నగదు జమవుతుందా?.. తాజా పరిస్థితి ఏంటంటే?

Rythu Bharosa Payment: రైతు భరోసా ఎప్పుడు?

శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ గడువు సైతం నిర్ణయించని అధికారులు
సర్వే ఆధారంగా వివరాలు అప్‌లోడ్
రాష్ట్రంలో యాసంగి సాగు 50 లక్షల ఎకరాలు అంచనా
పనిచేస్తున్న ఏఈవోలు 2,600 మంది
శాటిలైట్ ఇమేజ్ పూర్తి చేసేదెప్పుడు?, భరోసా వేసేటప్పుడు?
పత్తి రైతులకు భరోసా ఇస్తారా?
ప్రభుత్వ నుంచి ఇంకా రాని స్పష్టత

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతు భరోసా (Rythu Bharosa Payment) ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. సాగు యోగ్యంకాని భూములకు భరోసా నిధులు అందుతున్నాయనే విమర్శల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సాగైనా ఎకరాలను బట్టి రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ పూర్తి చేయాలని అధికారులకు (TS Govt) ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎప్పటిలోగా చేయాలనే దానిపై తేదీని నిర్ణయించలేదని సమాచారం. అలాంటప్పుడు రైతు భరోసా నిధులను ఎలా విడుదల చేస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. సంక్రాంతికి భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

రబీ సీజన్ ప్రారంభం కావడంతో ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు ప్రారంభించినట్లు సమాచారం. ప్రతి ఏటా ఎకరాకు 12 వేల రూపాయలను రైతుకు పెట్టుబడి సాయం కింద అందజేస్తోంది. సాగుకాని భూములకు సైతం భరోసా నిధులు పడుతున్నాయని విమర్శలు నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. రైతు.. అతనికి పట్టా పాసు బుక్ ఆధారంగా ఎన్ని ఎకరాలు ఉంది?, ఎంత సాగుతుంది? అనే వివరాలను ఏఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నెంబర్ల వారీగా క్రాప్ బుకింగ్.. పాడి వివరాలను.. రైతు వివరాలను నమోదు చేయనున్నారు. దాని ఆధారంగానే ప్రభుత్వం రైతు భరోసా నిధులను సంబంధిత రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు.

Read Also- Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

అయితే, శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్‌ను ఎప్పటివరకు నమోదు చేయాలనే దానిపై అధికారులకు స్పష్టత ఇవ్వలేదని సమాచారం. అలాంటప్పుడు పంటలు వివరాలను పోర్టల్‌లో ఎలా నమోదు చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వ్యవసాయ ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వనప్పుడు భరోసా నిధులు విడుదలపై సస్పెన్స్ నెలకొంది. యాసంగి ప్రారంభమై నెలరోజులు అవుతున్నప్పటికీ భరోసా నిధులు జమ కాకపోవడంతో రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు.

ఈ యాసంగిలో రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,600 మంది ఏఈవోలు పనిచేస్తున్నారు. మూడు నాలుగు గ్రామాలకు కలిసి ఒక ఏఈఓ విధులు నిర్వహిస్తున్నారు. అంటే ఒక ఏ ఈ ఓ సుమారు 5000 ఎకరాలు క్రాఫ్ట్ బుకింగ్ పోర్టల్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. సంక్రాంతికి భరోసా నిధులు విడుదల అవుతాయని ప్రచారం నేపథ్యంలో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ సక్సెస్ అవుతుందా అనేది సందిగ్ధం నెలకొంది.

అధికారులు గత యాసంగి, వానాకాలం సాగు లెక్కలు, రైతుభరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతోపాటు.. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు రైతుభరోసా చెల్లించాల్సి వస్తుంది? ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం అవసరమైన నిధులెన్ని అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటేరాష్ట్రంలో కోటిన్నర ఎకరాలకుపైగా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి. అందులో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడిన బీడు భూములు, స్థిరాస్తి వెంచర్లు కూడా ఉన్నాయి. పంటల సాగుకు వీలుకాని ఈ భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత వానాకాలం సీజన్‌లో మొత్తం విస్తీర్ణానికి రైతుభరోసా చెల్లించింది. అందులో సాగు యోగ్యంకాని సుమారు 5 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందినట్టు అధికారులు అంచనా వేశారు. యాసంగిలో ఇది రిపీట్ కావద్దని సాగు భూములను, సాగు యోగ్యంకాని భూములను పక్కాగా ధ్రువీకరించడానికి ఉపగ్రహ చిత్రాల(శాటిలైట్‌ ఇమేజ్‌ మ్యాపింగ్‌) ద్వారా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీకి ఈ బాధ్యత అప్పగించింది. ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తి చేస్తారనేది మాత్రం క్లారిటీ లేదని సమాచారం.

Read Also- Chamala Kiran Kumar Reddy: పదేళ్లు గాడిద పళ్లు తోమారా?.. బీఆర్ఎస్‌పై ఎంపీ చామల కిరణ్ ఫైర్

వానకాలం సీజన్‌లో రాష్ట్రంలో 69.40 లక్షల మంది రైతులకు రూ. 8,744 కోట్లను ప్రభుత్వం రైతు భరోసా కింద పంపిణీ చేసింది. అయితే,  యాసంగిలో పత్తిపంట సాగు 50 లక్షల ఎకరాల్లో సాగు అయినట్లు సమాచారం. వర్షాధారిత పంట కావడంతో యాసంగి సాగు చేయరు. దీనికి తోడు మిర్చి సైతం తక్కువగా సాగు అవుతుంది. ఈ నేపథ్యంలో వానాకాలంలో పత్తి, మిర్చి సాగు చేసిన రైతులకు ఈ యాసంగిలో విడుదల చేసే రైతు భరోసా నిధులు జమ చేస్తారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. భరోసా నిధులు విడుదల చేయకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. వ్యవసాయ అధికారులకు సైతం ప్రభుత్వ స్పష్టమైన ఆదేశాలు క్రాస్ బుకింగ్‌పై ఇవ్వలేదన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా నిధులు ఎప్పటివరకు విడుదల చేస్తారనేది చూడాలి. గతంలో సాగైనా వివరాల ఆధారంగా నిధులు విడుదల చేస్తారా.. లేకుంటే వానకాలం సాగు అయిన పత్తి పంట వివరాలను తొలగించి యాసంగి సాగైనా పంటలకు మాత్రమే భరోసా నిధులు విడుదల చేస్తారా అనే

Just In

01

Star Heroines: ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆశలన్నీ ఆ తమిళ సినిమాలపైనే!

Ustaad Bhagat Singh: మామా మరో పోస్టర్ వదిలారు.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Hey Bhagawan: ‘హే భగవాన్’ స్పెషల్ వీడియో చూశారా.. నవ్వకుండా ఉండలేరు!

Govt Employees: ఉద్యోగ సంఘాలకు కొత్త ఏడాది గుడ్ న్యూస్!.. సీఎం రేవంత్ కీలక సందేశం?

Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి