Bhatti Vikramarka: తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి
తిరుమలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) నూతన సంవత్సర సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్రజానీకానికి తమ సందేశాలను అందిస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ (Telangana) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కూడా తన సందేశాన్ని అందించారు. ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్ధించినట్లు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఉదయం కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Read Also- Sabarimala Temple: శబరిమల ఆలయంలో భారీ బంగారం చోరీ.. సిట్ నివేదికలో సంచలన విషయాలు
విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయండి
అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో పెరిగినా దానికి అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భట్టిని గురువారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, సంస్థ డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతిపాదించిన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని భట్టి వారికి స్పష్టంచేశారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు శివాజీ, నర్సింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డి ఉన్నారు.
Read Also- Vishwak Sen: విశ్వక్ సేన్ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. అనౌన్స్‌మెంట్ టీజర్ అదిరింది

