TG University Recruitment: తెలంగాణ వర్సిటీలో 73% ఖాళీలు
TG University Recruitment (imagecredit:twitter)
Telangana News

TG University Recruitment: తెలంగాణ వర్సిటీలో 73% ఖాళీలు.. పట్టించుకోని సర్కార్..!

TG University Recruitment: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తీవ్ర అధ్యాపక కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉన్నత విద్యను అందించాల్సిన వర్సిటీలు ఇప్పుడు ఖాళీలకు నిలయంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన విశ్వవిద్యాలయాల్లో మంజూరైన పోస్టుల సంఖ్యకు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్యకు పొంతన లేకుండా పోయింది. రాష్ట్రంలోని వర్సిటీల్లో మొత్తం 2,816 సాంక్షన్డ్ పోస్టులు ఉండగా, అందులో ఏకంగా 2,059 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 757 మంది రెగ్యులర్ అధ్యాపకులతోనే విద్యాసంస్థలు నెట్టుకొస్తున్నాయి. అంటే దాదాపు 73 శాతానికి పైగా పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో పరిశోధనలు, బోధన నాణ్యత దెబ్బతింటున్నాయి. కాంట్రాక్ట్, పార్ట్-టైమ్ అధ్యాపకులపైనే భారం పడుతోంది.

ప్రొఫెసర్లు నిల్..

రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల్లో ఒక్క రెగ్యులర్ ప్రొఫెసర్ కూడా లేకపోవడం గమనార్హం. కాకతీయ యూనివర్సిటీలో 80 శాతం పోస్టులు ఖాళీగా ఉండగా, ప్రొఫెసర్లు ఎవరూ లేరు. తెలంగాణ వర్సిటీలో 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జరిగిన వైస్ ఛాన్సలర్ల కాన్ఫరెన్స్‌లో కూడా వీసీలు తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ రిక్రూట్‌మెంట్ జరగలేదని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శలు వస్తున్నాయి. కేవలం బోధనకే కాకుండా, కనీస మౌలిక సదుపాయాలకు కూడా నిధులు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందనే ఆరోపణలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి.

నిధులపై ప్రభావం..

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు లేకుండా పరిశోధనలు చేయడం అసాధ్యం. రీసెర్చ్ జరగకపోతే యూజీసీ నుంచి వచ్చే గ్రాంట్స్ ఆగిపోతాయి, పేపర్లు పబ్లిష్ కావు, ర్యాంకింగ్స్ రావు. తద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు, కేవలం వర్సిటీలే కాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని 150 డిగ్రీ కళాశాలల్లో 4,098 సాంక్షన్డ్ పోస్టులు ఉండగా, కేవలం 1,255 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 2,843 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడింట రెండు వంతుల పోస్టులు ఖాళీగా ఉండటం విద్యావ్యవస్థ పతనాన్ని సూచిస్తోంది. ఇప్పటికైనా సర్కార్ స్పందించి యుద్ధ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి షురూ.. పొంగులేటి కీలక ప్రకటన

ఉస్మానియా యూనివర్సిటీ

సాంక్షన్డ్ పోస్టులు : 1267
ప్రొఫెసర్లు : 147
అసోసియేట్లు : 53
అసిస్టెంట్లు : 131
మొత్తం పని చేస్తున్నవారు : 331
ఖాళీలు : 936(73%)

కాకతీయ యూనివర్సిటీ

సాంక్షన్డ్ పోస్టులు : 439
ప్రొఫెసర్లు : 0
అసోసియేట్లు : 2
అసిస్టెంట్లు : 77
మొత్తం పని చేస్తున్నవారు : 79
ఖాళీలు : 330(80%)

తెలంగాణ యూనివర్సిటీ

సాంక్షన్డ్ పోస్టులు : 152
ప్రొఫెసర్లు : 3
అసోసియేట్లు : 10
అసిస్టెంట్లు : 48
మొత్తం పని చేస్తున్నవారు : 61
ఖాళీలు : 91

మహాత్మాగాంధీ యూనివర్సిటీ

సాంక్షన్డ్ పోస్టులు : 70
ప్రొఫెసర్లు : 0
అసోసియేట్లు : 6
అసిస్టెంట్లు : 29
మొత్తం పని చేస్తున్నవారు : 35
ఖాళీలు : 35

శాతవాహన యూనివర్సిటీ

సాంక్షన్డ్ పోస్టులు : 63
ప్రొఫెసర్లు : 0
అసోసియేట్లు : 0
అసిస్టెంట్లు : 16
మొత్తం పని చేస్తున్నవారు : 16
ఖాళీలు : 47

పాలమూరు యూనివర్సిటీ

సాంక్షన్డ్ పోస్టులు : 95
ప్రొఫెసర్లు : 0
అసోసియేట్లు : 2
అసిస్టెంట్లు : 16
మొత్తం పని చేస్తున్నవారు : 18
ఖాళీలు : 77

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ(పొట్టి శ్రీరాములు)

సాంక్షన్డ్ పోస్టులు : 55
ప్రొఫెసర్లు : 0
అసోసియేట్లు : 0
అసిస్టెంట్లు : 8
మొత్తం పని చేస్తున్నవారు : 8
ఖాళీలు : 47

బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

సాంక్షన్డ్ పోస్టులు : 86
ప్రొఫెసర్లు : 0
అసోసియేట్లు : 1
అసిస్టెంట్లు : 23
మొత్తం పని చేస్తున్నవారు : 24
ఖాళీలు : 62

జేఎన్టీయూ 

సాంక్షన్డ్ పోస్టులు : 410
ప్రొఫెసర్లు : 22
అసోసియేట్లు : 44
అసిస్టెంట్లు : 86
మొత్తం పని చేస్తున్నవారు : 152
ఖాళీలు : 258

జేఎన్‌ఏఎఫ్‌ఏయూ

సాంక్షన్డ్ పోస్టులు : 61
మొత్తం పని చేస్తున్నవారు : 14
ఖాళీలు : 47

ఆర్జీయూకేటీ

సాంక్షన్డ్ పోస్టులు : 148
మొత్తం పని చేస్తున్నవారు : 19
ఖాళీలు : 129

Also Read: Nayanthara Toxic: యష్ ‘టాక్సిక్’ నుంచి నయనతార లుక్ వచ్చేసింది.. ఏలా కనిపిస్తుందంటే?

Just In

01

Sabarimala Temple: శబరిమల ఆలయంలో భారీ బంగారం చోరీ.. సిట్ నివేదికలో సంచలన విషయాలు

Honey Glimpse: భయపెడుతోన్న నవీన్ చంద్ర.. ‘హనీ’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

Kawasaki Z650RS: భారత్‌లో లాంచ్ అయిన కవాసాకి Z650RS.. E20 ఫ్యూయల్ సపోర్ట్‌తో

Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Stray Dogs Attack: బాలుడిపై ఒక్కసారిగా 4 కుక్కల దాడి.. రంగారెడ్డిలో దారుణం