Guntur GGH Hospital: పాఠశాలలో చదువుకునే విద్యార్థుల మధ్య చిన్న పాటి పోటీతత్వం ఉంటుంది. చదువు, అల్లరి, ఆటల విషయంలో తోటి విద్యార్థులతో వారు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో చిన్నపాటి బెట్స్ కూడా వేసుకోవడం సహజంగా చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందిన ఓ విద్యార్థి కూడా స్నేహితులతో పందెం కట్టాడు. ఇందులో భాగంగా రూ.50 కోసం ఏకంగా ఓ పెన్నును మింగేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా మూడేళ్లపాటు దాచేశాడు. చివరికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రి పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే..
16 ఏళ్ల రవి మురళికృష్ణ అనే బాలుడు.. ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టిన మురళీ.. పెన్ను మింగేశాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచాడు. ఏడాదిగా కడుపునొప్పి వస్తున్నప్పటికీ కూడా మౌనంగా ఉండిపోయాడు. అయితే తాజాగా ఆ నొప్పి మరింత తీవ్రతరం కావడంతో మురళీ మౌనంగా ఉండలేకపోయాడు. తల్లిదండ్రులకు కడుపునొప్పి గురించి చెప్పడంతో పాటు.. పెన్ను మింగిన విషయాన్ని వాళ్ల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్న తల్లిదండ్రులు మురళీని.. హుటాహుటీనా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగిన యువకుడు..
గుంటూరు GGH వైద్యులు అరుదైన ఘనత సాధించారు. మూడేళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టి పొరపాటున పెన్ను మింగిన 16 ఏళ్ల రవి మురళీకృష్ణ అనే యువకుడి ప్రాణాలను కాపాడారు. ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని పరీక్షించిన వైద్యులు, పేగుల్లో… pic.twitter.com/TR3KbA5Kc5
— ChotaNews App (@ChotaNewsApp) January 1, 2026
Also Read: Switzerland: న్యూయర్ వేడుకల్లో భారీ పేలుడు.. ఎగసిపడ్డ మంటలు.. చెల్లాచెదురుగా మృతదేహాలు
అరుదైన వైద్యం..
బాలుడు పెన్ను మింగిన విషయాన్ని తెలుసుకున్న గుంటూరు జీజీహెచ్ వైద్యులు అతడికి సీటీ స్కాన్ చేశారు. కడుపులో పెన్ను ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. అయితే ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండానే.. గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు పెన్నును బయటకు తీశారు. గత ఏడాది కాలంగా తీవ్రంగా పడుతున్న కడుపునొప్పి బాధ నుంచి మురళీకి విముక్తిని కల్పించారు. బాలుడు మింగిన పెన్ను పెద్దపేగులో ఉండిపోయిందని.. దాని పొడవు 13 సెం.మీగా ఉందని గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం క్షేమమని.. ఇకపై కడుపు నొప్పి సమస్య అతడ్ని బాధించదని స్పష్టం చేశారు. మరోవైపు శస్త్రచికిత్స లేకుండా తమ బిడ్డ సమస్యను పరిష్కరించడం పట్ల మురళీ పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

