Bhootham Praytham: న్యూ ఇయర్ ట్రీట్ ‘చికెన్ పార్టీ’ సాంగ్ చూశారా?
Bhootham Praytham (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bhootham Praytham: ‘భూతం ప్రేతం’ న్యూ ఇయర్ స్పెషల్‌ ‘చికెన్ పార్టీ’ సాంగ్ చూశారా?

Bhootham Praytham: సినిమా టైటిల్ చూస్తే ‘భూతం ప్రేతం’ అని భయపడేలా ఉంది కానీ, తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్ చూస్తే మాత్రం ఫుల్ బాటిల్ ఎనర్జీ రావడం పక్కా. సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ బ్యానర్లపై బి. వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘భూతం ప్రేతం’ (Bhootham Praytham). రాజేష్ ధృవ దర్శకత్వం వహిస్తూనే ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో సెగలు పుట్టిస్తోంది. కొత్త సంవత్సరం అంటేనే పార్టీలు, ఎంజాయ్‌మెంట్. సరిగ్గా ఈ మూడ్‌ని క్యాచ్ చేస్తూ చిత్ర యూనిట్ ‘చికెన్ పార్టీ’ అనే ఊపు ఇచ్చే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట వింటుంటే బాడీలో వైబ్రేషన్స్ రావడం గ్యారెంటీ! గిరీష్ హోతుర్ అందించిన మాస్ బీట్స్, అనిరుధ్ శాస్త్రి హై-వోల్టేజ్ గాత్రం పార్టీ లవర్స్‌కి అసలైన కిక్ ఇస్తున్నాయి. ఈ పాటకి లిరిక్స్ అందించింది మరెవరో కాదు.. దర్శకుడు రాజేష్ ధృవానే.. స్వయంగా కలం పట్టి మాస్ పల్స్ పట్టేశారు. ఈ పాట విషయానికి వస్తే..

Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ మూవీ ‘రాజే యువరాజే’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

స్క్రీన్ అంతా రచ్చే!

ఈ పాటలో అసలైన హైలైట్ ఎవరంటే.. బుల్లితెర సెన్సేషన్స్ అయిన యాదమ్మ రాజు (Yadamma Raju), బిందాస్ భాస్కర్ (Bindas Bhaskar) తదితరులు. వీరందరూ కలిసి వేసిన స్టెప్పులు, వారి ఎనర్జీ సాంగ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, రాజేష్ ధృవ కూడా తమదైన స్టైల్లో రచ్చ చేస్తూ పార్టీని పీక్స్‌కి తీసుకెళ్లారు. ఈ పాట చూస్తుంటే సినిమాలో వినోదం ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోందని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. యోగేష్ గౌడ సినిమాటోగ్రఫీ, ఉజ్వల్ చంద్ర ఎడిటింగ్ సినిమాకి రిచ్ లుక్ ఇస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

Also Read- Geetha Arts 2025: ఒక మధుర జ్ఞాపకం.. 2025 జర్నీపై గీతా ఆర్ట్స్ నుంచి ఎమోషనల్ ట్వీట్!

న్యూ ఇయర్‌ ట్రీట్

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి ‘చికెన్ పార్టీ’తో మంచి స్టార్ట్ ఇచ్చిన ‘భూతం ప్రేతం’ టీమ్, థియేటర్లలో ఏ రేంజ్ హంగామా చేస్తుందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ సాంగ్ మాత్రం మంచి స్పందనను రాబట్టుకుంటూ సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. ఈ సాంగ్ విడుదల సందర్భంగా దర్శకుడు రాజేష్ ధృవ (Raajesh Dhruva) మాట్లాడుతూ.. మేమిచ్చిన ఈ న్యూ ఇయర్‌ ట్రీట్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాము. సినిమా కూడా హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Krishna Vamsi: ‘మురారి క్లైమాక్స్’పై కృష్ణవంశీ పోస్ట్ వైరల్!

Purushaha: పాపం సప్తగిరి.. ‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్‌ ఫస్ట్ లుక్!

Bhootham Praytham: ‘భూతం ప్రేతం’ న్యూ ఇయర్ స్పెషల్‌ ‘చికెన్ పార్టీ’ సాంగ్ చూశారా?

The Raja Saab: ‘ది రాజా సాబ్’ మూవీ ‘రాజే యువరాజే’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Meesaala Pilla Song: 100 మిలియన్ వ్యూస్‌తో 2025 బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా ‘మీసాల పిల్ల’!