Meesaala Pilla Song: ఒక సినిమా విజయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) నిరూపిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. దీంతో 2025 సంవత్సరంలోనే తెలుగు బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా ఈ పాట సరికొత్త చరిత్ర సృష్టించింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) అందించిన అద్భుతమైన ట్యూన్, లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ, శ్వేతా మోహన్ గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. పాత తరం నోస్టాల్జియాని, ఇప్పటి ట్రెండీ ఎనర్జీని మిక్స్ చేస్తూ భీమ్స్ కంపోజ్ చేసిన తీరు శ్రోతలను కట్టిపడేసింది. ముఖ్యంగా స్క్రీన్ మీద చిరంజీవి మార్క్ గ్రేస్, ఆయన సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ పాటలో చిరంజీవి, నయనతార (Nayanthara) మధ్య కెమిస్ట్రీ విజువల్ ట్రీట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట 100 మిలియన్ల క్లబ్‌లోకి చేరినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
Also Read- Geetha Arts 2025: ఒక మధుర జ్ఞాపకం.. 2025 జర్నీపై గీతా ఆర్ట్స్ నుంచి ఎమోషనల్ ట్వీట్!
ప్రమోషన్స్‌లో జోరు
కేవలం ‘మీసాల పిల్ల’ సాంగ్ మాత్రమే కాదు, రెండో పాట ‘శశిరేఖ’ కూడా 35 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక మంగళవారం విడుదలైన మూడో పాట ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ అయితే నెట్టింట ఊచకోత కోస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి మాస్ స్టెప్పులతో అదరగొట్టడం ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్ అని చెప్పాలి. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే 8 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు ఈ పాట పర్ఫెక్ట్ పార్టీ యాంథమ్‌గా మారిపోయింది. ఈ పాటతో సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తనదైన తరహాలో సినిమాకు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో సందడి చేసి, అక్కడి విద్యార్థులతో ముచ్చటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిరంజీవి, నయనతార, కేథరీన్ కూడా భాగమవుతారని తెలుస్తోంది.
Also Read- Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది
సంక్రాంతి రేసులో మెగాస్టార్
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, భీమ్స్ మ్యూజిక్, మెగాస్టార్ చరిష్మా, వెంకీ గెస్ట్ రోల్.. వంటివన్నీ ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలను కచ్చితంగా అందుకుంటామని, అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ఒక సంపన్న ఎన్‌ఐఏ (NIA) ఏజెంట్‌గా కనిపిస్తుండగా, వెంకటేష్ ఒక ప్రత్యేకమైన రోల్‌లో అలరించనున్నారని తెలుస్తోంది. వెంకీ ఎంట్రీతో ఈ సినిమా రేంజే మారిపోతుందని చిత్ర టీమ్ కూడా చెబుతోంది. మ్యూజికల్ హిట్‌తో ఇప్పటికే సగం విజయాన్ని అందుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’, జనవరి 12న థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు రెడీ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

