Nayanthara Toxic: పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic: A Fairytale for Grown-Ups). ఈ చిత్రం నుంచి తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతారకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. ఇందులో ఆమె ‘గంగ’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో నయనతార అత్యంత స్టైలిష్‌గా, ఇంటెన్సివ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి, చేతిలో గన్ పట్టుకుని ఒక పెద్ద క్యాసినో ముందర నిలబడి ఉన్న దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గంగ అనే ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమని, ఆమె ఒక పవర్‌ఫుల్, ధైర్యవంతురాలైన మహిళగా కనిపించనుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
Read also-Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?
‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇదొక పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. డ్రగ్ మాఫియా నేపథ్యంలో 1940-50 నాటి కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. యశ్, నయనతారలతో పాటు కియారా అద్వానీ (నాడియా పాత్రలో), హుమా ఖురేషీ (ఎలిజబెత్ పాత్రలో) నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యశ్ స్వయంగా ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ ద్వారా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19న ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
Read also-Anil Ravipudi: శివాజీ వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించిన అనిల్ రావిపూడి.. ఏమన్నారంటే?
నయనతార లుక్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ‘గంగ’ పాత్ర ట్రెండింగ్‌లో ఉంది. ఒకప్పుడు ‘బిల్లా’ వంటి సినిమాల్లో నయన్‌ను చూసిన స్టైలిష్ లుక్ మళ్ళీ ఇన్నాళ్లకు ఈ సినిమాలో కనిపిస్తోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లక్ చూసిన నెటిజన్లు.. లేడీ సూపర్ స్టార్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏ పాత్రలో నయినా లీనమైపోయే నయనతార ఇందులో కూడా తనదైన లుక్ లో ఇమిడిపోయింది. వడుదల చేసిన పోస్టర్ ను చూస్తుంటే..నయన తార లేడీ డాన్ పాత్రలో చేస్తున్నట్లు తెలుస్తోంది.
Introducing Nayanthara as GANGA in – A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie
@advani_kiara @humasqureshi #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry… pic.twitter.com/FSiWGo7XeC
— Yash (@TheNameIsYash) December 31, 2025

